Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

అభివృద్ధిలో తెలంగాణ ప్రథమం

Telangana is the first in development

రాష్ట్రమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

మన తెలంగాణ/సారంగాపూర్: దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని గురువారం రూ. 16లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడు తూ తెలంగాణ ఏర్పడిన తరువాత సిఎం కేసిఆర్ వివిధ పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచారన్నారు. రైతుబంధు పథకం దే శానికే ఆదర్శనం అన్నారు. గ్రా మాల్లో మౌలిక సదుపాయాలు, రైతులకు రూ.5లక్షల బీమా, 24గంటల ఉచిత విద్యుత్, సాగునీరు, నిరుపేదలకు ఇళ్లు, హాస్టల్స్‌లో విద్యార్థులను సన్నబియ్యం అందిస్తున్నారన్నారు. దేవాలయాలు, రోడ్లు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతు న్న రాష్ట్రం తెలంగాణయేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజ్‌మహ్మద్, డిఒ తుకారాం, ఎంపిడిఒ గుమ్ముల గంగాధర్, సర్పంచ్ వైష్టవి, మండల ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, నాయకులు దేవి శంకర్, మధుకర్‌రెడ్డి, భూమేష్ తదితరులు ఉన్నారు.

Comments

comments