Home తాజా వార్తలు మంత్రివర్గ సమావేశం ప్రారంభం

మంత్రివర్గ సమావేశం ప్రారంభం

Telangana Cabinet meeting was Postponed

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో ఆదివారం మధ్యాహ్నం కెసిఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కెటిఆర్, మహేందర్‌రెడ్డి మినహా మిగతా మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కీలక అంశాలతో పాటు ముందస్తు ఎన్నికలపై  చర్చ జరగనున్నట్టు సమాచారం. గతంలో కొన్ని శాఖలు తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఐఆర్, ఉద్యోగాల భర్తీతో పాటు పలు సంక్షేమ పథకాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేరుగా ప్రగతి నివేదన సభకు వెళ్లనున్నారు.