Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

తెలంగాణ ప్రాంతానికి ఆయువు పట్టు చెరువులే

తెలంగాణ ఉద్యమంలోనే చెరువుల పునరుద్ధరణకు ఆకాంక్ష : సిఎం ఒఎస్‌డి దేశపతి శ్రీనివాస్
వర్షపు నీటిని ఒడిసిపట్టాలి : కలెక్టర్ లోకేశ్
మిషన్ కాకతీయ ప్రచారంపై అధికారుల చర్చ

khammam11ఖమ్మం కలెక్టరేట్: తెలంగాణ ప్రాంతానికి చెరువులే ఆయువు పట్టులని, తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమ సమయంలోనే స్వరా ష్ట్రంలో చెరువుల పునరుద్ధ్దరణకు తొలి ప్రాధా న్యం ఇవ్వాలని ప్రజలు తమ బలీ యమైన ఆకాంక్షను వ్యక్తపరిచారని రాష్ట్ర ముఖ్యమ ంత్రి ఒఎస్‌డి దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో మిషన్ కాకతీయ ప్రగతి మరింతగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన భిన్న ప్రచార మార్గాలపై జిల్లా కలెక్టర్ డిఎస్.లోకేశ్ కుమార్‌తో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కెసిఆర్ మిషన్ కాకతీయ పేరుతో అనాథలుగా మారిన చెరువులకు పూర్వవైభవం కల్పించే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. సంయుక్త రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన నష్టం, వెనుకబాటు తనాన్ని పారదోలేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రజా సంస్కృతితో భాగమై ఈ ప్రాంత అభివృద్ధికే ఆయువు పట్టుగా ఉన్న చెరువుల పునరుద్ధ్దరణకు ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. మిషన్ కాకతీయ తొలి దశలో భాగంగా పనులు చేపట్టిన చెరువులు గతంలో పిచ్చి మొక్కలతో దర్శనం ఇవ్వగా నేడు జలకళను సంతరించుకున్నాయన్నారు. ఖమ్మం జిల్లాలో మిషన్ కాకతీయ ప్రగతి బాగుందన్నారు. వర్షాలు మిగతా జిల్లాల కంటే ఖమ్మంలో బాగుండడంతో పునరుద్ధ్దరణ పూర్తి చేసుకున్న చెరువులు నిండు కుండలా దర్శన మిస్తున్నాయన్నారు. మిషన్ కాకతీయ సాధిస్తున్న విజయాలను, ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమంలా వర్షపు నీటి పొదుపు : కలెక్టర్
తెలంగాణ ఉద్యమంలా వర్షపు నీటి పొదుపు ఉద్యమం సాగాలని కలెక్టర్ డిఎస్.లోకేష్ కుమార్ అన్నారు. మిషన్ కాకతీయ మొదటి దశ పనులు గ్రౌడింగ్‌లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. అదే స్ఫూర్తితో రెండో దశ పనుల్లో ప్రథమ స్థానం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో 43 శాతం పైగా గ్రీన్ కవర్ ఉన్నందున జిల్లాలో రాష్ట్రం సగటు కంటే అధిక వర్షాలు కురుస్తున్నా యన్నారు. సగటున ప్రతి సంవత్సరం 530 టిఎంసిల వర్షపు నీరు జిల్లా భూభాగంలో కురుస్తుందన్నారు. అయినప్పటికీ జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తుతుందన్నారు. జిల్లాలోని ప్రజలు పశు, వన్య ప్రాణులకు కేవలం 24 నుండి 30 టిఎంసిల నీరు సరిపోతుందన్నారు. జిల్లా భూభాగంలో వర్ష రూపేణా కురుస్తున్న 530 టిఎంసిల నీటిని ఒడిసి పట్టి భూగర్భంలో ఇంకేలా చూస్తే తాగునీటి కష్టాలతో పాటు చాలా వరకు తాగునీటి కష్టాలు తీరుతాయన్నారు. అంతేకాకుండా మృత్తిక కోతను నివారించి భూసారం కోల్పోకుండా చూడవచ్చున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఓఎస్‌డి శ్రీధర్ పాండే, 30 మందికి పైగా రచయితలు, కవులు పాల్గొన్నారు.

Comments

comments