Search
Monday 24 September 2018
  • :
  • :

ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి..!

harishrao at sundhilla irrigation project

  • సుందిల్ల బ్యారేజీ, అన్నారం పుంపు హౌస్ పనులను ఆకస్మిక తఖీ చేసిన మంత్రి హరీష్‌రావు
  • స్థానిక ఎంఎల్‌ఎను, మీడియాకు అనుమతి నిరాకరణ

మంథని: ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. గోదావరి నదిపై నిర్మిస్తున్న సుందిల్ల బ్యారేజీ, అన్నారం పుంపుహౌస్ పనులను శనివారం ఉదయం ఆయన ఆకస్మిక తనఖీ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో సుందిల్ల బ్యారేజీ పనులను, మంథని మండలం కాశీపేట గ్రామంలో నిర్మిస్తున్న అన్నారం బ్యారేజీ పనులపై మంత్రి ఆరా తీశారు. మంత్రి హరీష్‌రావు వెంట ఎల్లంపల్లి ఛీప్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లు, సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు.
స్థానిక ఎంఎల్‌ఎను, మీడియాను అనుమతించకపోవడం వెనుక అంతర్యమేమీటి..!

సుందిల్ల బ్యారేజీ, అన్నారం పంపుహస్ పనులను తనిఖీకి వచ్చిన మంత్రి హరీష్‌రావుకు సిరిపురం వద్ద మంథని ఎంఎల్‌ఎ పుట్ట మధుతో పాటు టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్న ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పరిశీలనతో తన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్ నాయకులతో పాటు స్ధానిక మంథని ఎంఎల్‌ఎ పుట్ట మధు, మీడియాను సైతం అనుమతించకపోవడం అందరిని విస్మయానికి గురి చేసింది.

స్థానిక ప్రజాప్రతినిధులను, మీడియాను అనుమతించకపోయినప్పటికినీ తెలంగాణ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్న తమ అధికార పార్టీకి చెందిన స్థానిక మంథని ఎంఎల్‌ఎ పుట్ట మధును అనుమతించకపోవడం వెనుక అంతర్యమేమీటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎంఎల్‌ఎ పుట్ట మధును మంత్రి హరీష్‌రావు వెంట పనుల పరిశీలనకు అనుమతించకపోవడం ఆయనను అవమానించడమేనని టిఆర్‌ఎస్ నాయకులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు..!

ఇది ఇలా ఉంటే సుందిల్ల బ్యారేజీ, అన్నారం పంపు హౌస్ నిర్మాణాల కోసం తమ విలువైన పంట భూములను త్యాగం చేసినా రైతులు మంత్రి హరీష్‌రావు ముందు తమ సమస్యల గోడును విన్నవించుకోవాలని ఎంతో ఆశగా వచ్చిన మంత్రి హరీష్‌రావు ఎవరితో మాట్లాడకుండా ముఖం చాటేసి వెళ్లిపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments