Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

శరత్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు

Sharath Parents Meet to DGP Mahender Reddy

హైదరాబాద్: అమెరికాలో మృతి చెందిన శరత్ కుటుంబాన్ని మంత్రులు పరామర్శించారు. అమీర్‌పేటలో ఆయన తల్లిదండ్రులకు మంత్రులు కడియం శ్రీహరి, కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. శరత్ మృతిపట్ల సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని కెటిఆర్ పేర్కొన్నారు. శరత్ కుటుంబ సభ్యులెవరైనా అమెరికా వెళితే వీసా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

కాల్పులు ఎవరు జరిపారనే విషయమై సరైన సమాచారం లేదని కడియం శ్రీహరి తెలిపారు. అక్కడ ఉన్న తెలుగు విద్యార్థులతో మాట్లాడుతున్నామని, అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని కడియం వివరించారు. శరత్ మృతదేహాన్న సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు వెల్లడించారు. అమెరికాలోని మిస్సోరి యూనివర్సిటీలో చదువుతున్న వరంగల్ విద్యార్థి కొప్పు శరత్ (25)పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శరత్ మృతి చెందిన విషయం తెలిసిందే.

Comments

comments