Home తాజా వార్తలు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

MLC-Elections

హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలోని మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం మరియు కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.  ఈ నెల 25న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. నామినేషన్ల దాఖలుకు తుదిగడువు మార్చి 5. మార్చి 6న నామినేషన్ల పరిశీలించనున్నారు. మార్చి 8న ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువుగా నిర్ణయించింది. మార్చి 22న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మార్చి 26న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Telangana MLC Election Schedule Released