Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

తెలంగాణ ఉద్యమకారుడు ఆదిరాజు కన్నుమూత

poetry

హైదరాబాద్: తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు ఆదిరాజు వెంకటేశ్వరరావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆదిరాజు తుదిశ్వాస విడిచారు. ఆదిరాజు వెంకటేశ్వరరావు ప్రముఖ రచయిత, జర్నలిస్టుగా పేరొందారు. వెంకటేశ్వరరావు మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 1969 తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా స్వరాష్ట్ర సాధన కోసం వెంకటేశ్వరరావు ఎంతో పోరాటం చేశారని కొనియాడారు. పత్రిక, సాహితీ రంగానికి ఆదిరాజు విశేష సేవలు అందించారని ప్రశంసించారు. వెంకటేశ్వరరావు స్వస్థలం ఖమ్మం జిల్లా పండితాపురం గ్రామం.

Comments

comments