Home జాతీయ వార్తలు తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలి : కడియం

తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలి : కడియం

Delhi : Telangana Needs Special Statusఢిల్లీ : ఎపికి ప్రత్యేక హోదా ఇస్తే , తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. ఎపిలో ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమంలో చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. గురువారం ఆయన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్‌ను కలిశారు. విభజన చట్టంలోని హామీల మేరకు గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఆయన జవడేకర్‌ను కోరారు. కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటితో పాలు పలు విద్యా సంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ అంశాలపై కేంద్రమంత్రి జవడేకర్ సానుకూలంగా స్పందించారని కడియం తెలిపారు.

Telangana Needs Special Status : Kadiyam