Home తాజా వార్తలు ‘ఆదాయ వృద్ధిరేటులో తెలంగాణ నెం.1’

‘ఆదాయ వృద్ధిరేటులో తెలంగాణ నెం.1’

kcr

హైదరాబాద్: గత నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు దేశంలోనే తొలి స్థానంలో ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2014 జూన్ నుంచి 2018 మే వరకు దేశంలోని ఆయా రాష్ట్రాల ఆదాయ వృద్ధి రేట్లను కాగ్ వెల్లడించిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఆదాయం 17.2 శాతం వృదిరేటుతో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, మిగతా రాష్ట్రాల ఆదాయం వృద్ధిరేటు 10 శాతం లోపే ఉందని పేర్కొన్నారు. ఆదాయ వృద్ధితో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని అమలు చేయవచ్చన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, పన్నుల చెల్లింపులో ప్రజల చిత్తశుద్ధి వల్లే ఇది సాధ్యమైందని సిఎం తెలిపారు. నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి నిర్ణయాల తర్వాత కూడా స్థిరమైన వృద్ధి సాధించామని కెసిఆర్ అన్నారు. తెలంగాణ తర్వాత 14.2 శాతంతో హరియాణా 2వ స్థానంలో నిలువగా.. 3, 4, 5వ స్థానాల్లో మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ్‌బంగ నిలిచినట్లు కాగ్ వెల్లడించింది.