Home జగిత్యాల సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వన్

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వన్

* వ్యవసాయ రంగానికి రూ.30వేల కోట్లు
* రాబోయే రెండు సంవత్సరాల్లో మరిన్ని
సంక్షేమ పథకాలు
* రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ
మంత్రి ఈటెల రాజేందర్
MINISTER-ETELA

మనతెలంగాణ/జగిత్యాల: సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. 27న వరంగల్‌లో జరిగే టిఆర్‌ఎస్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ము ఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేం దర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ లేక అంధకారం అవుతుందని, తెలంగాణ వారికి పాలించే స త్తా లేదని ఎగతాళి చేసిన వారికి చెంపపెట్టుగా ఈ రోజు తె లంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు పోతుందన్నారు.

గతంలో ఉద్యమ పార్టీలు అధికారంలోకి వచ్చి విజయవంతంగా పరిపాలన సాగించిన చరిత్రలేదని దానికి భిన్నంగా సిఎం కెసిఆర్ అకుంటిత దీక్ష, అంకిత భావంతో పని చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పథం లో నడిపిస్తున్నాడన్నారు. ప్రతిపక్షాలు రైతుల కోసం ఏమి చేశారంటూ విమర్శలకు దిగుతున్నాయని, గతంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని స్థాయి నుండి నేడు రైతాంగానికి 9 గంటల నాణ్యమైన వి ద్యుత్‌ను అందించే స్థాయి ఎదిగామన్నారు. ఉమ్మడి రా ష్ట్రంలో వ్యవసాయ రంగానికి కేవలం రూ.10వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టేవారని, దానికి భిన్నంగా ప్రస్తుతం వ్యవసాయానికి,వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.30 వేల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిద న్నారు.

ఆనాడు యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్పుడు రాష్ట్రంలో రుణమాఫీ చేసిన మొత్తం రూ.3వేల 380 కోట్లు మాత్రమేనని, ప్రస్తుతం రూ.17వేల కోట్లు రుణ మాఫీ జరిగిందన్నారు. దీనికి తోడు రూ.5వేల300 కోట్ల స బ్సిడీ, విద్యుత్ కోసం రూ.6వేల కోట్లు వ్యవసాయం కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. గతంలో కేవలం వ్యవసాయ ర ంగానికి రూ.16వేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే నేడు రూ. 30వేల కోట్లను ఖర్చు చేస్తున్నామని వివరించారు. అనేక రంగాల్లో అభివృద్ది సాధించడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం మానవతా ధృక్పథంతో వ్యవహరిస్తూ ఎన్నో ప థకాలకు రూపకల్పన చేసిందన్నారు.

విద్యార్థులు పురుగు ల అన్నం, దొడ్డు బియ్యంతో సగం కడుపుకు మధ్యాహ్నా భోజనం చేస్తుండే వారని దానికి భిన్నంగా నేడు సన్నబి య్యంతో విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెడుతున్న ఘనత తమదేనన్నారు. ప్రమాదాల్లో మృతి చెందిన వారికి గతంలో ఎక్స్‌గ్రేషియా చెల్లించే అవకాశం ఉండేది కాదని, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాలకు రూ.6లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించేలా చర్య లు చేపట్టడం జరిగిందన్నారు.

రాబోయే రోజుల్లో మరిన్నీ సంక్షేమ పథకాలకు రూపకల్పన చేస్తూ తెలంగాణ రాష్ట్రా న్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా చేస్తామన్నారు. 27న వరంగల్‌లో జరిగే భారీ బహిరంగ సభకు జగిత్యాల జిల్లా నుండి 50వేల మంది తరలిరావాలని దానికి నియో జకవర్గాల వారిగా నాయకులు, కార్యకర్తలు ప్రణాళికలు రూపొందించుకొని బహిరంగ సభ విజయవంతం చేయా లని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు డాక్టర్ వేణుగోపాలచారి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కోరుట్ల ఎమ్మె ల్యే విద్యాసాగర్‌రావు, మార్క్‌ఫెడ్ చైర్మన్ లోకబాపురెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బరోద్దిన్, జగిత్యాల నియో జకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ సంజయ్‌కుమార్, కోరుట్ల ము న్సిపల్ చైర్మన్ వేణుగోపాల్, రాయికల్, సారంగాపూర్ ఎం పిపిలు పడాల పూర్ణిమ, శారద, మార్కెట్ కమిటీ చైర్మన్ శీ లం ప్రియాంక, జెడ్పీటీసీ పెండెం నాగలక్ష్మీ, నాయకులు బాదినేని రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.