Home మెదక్ శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలో.. తెలంగాణ నంబర్ వన్

శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలో.. తెలంగాణ నంబర్ వన్

dgp* సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల పోలీసు అధికారులతో సమీక్షలో రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : శాంతిభ్రదతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. సంగారెడ్డిలోని పోలీసు కళ్యాణ మండపంలో సంగారెడ్డి, మెద క్, వికారాబాద్ జిల్లాల పోలీసు అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేశా రు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నక్సల్స్ సమస్య, ఉగ్రవాదుల సమస్య వంటి శాంతి భద్రతల సమస్యలు వస్తాయని చాలా మంది భావించారని, కానీ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అందుకు భిన్నంగా ఉందన్నారు. తెలంగాణ పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఈ సంవత్సరం రెండు ముఖ్యమైన లక్షాలను నిర్దేశించుకున్నట్టు తెలిపారు. ఒకటి రాష్ట్ర వ్యా ప్తంగా ఒకే విధమైన సేవలందించడం, రెం డోది ప్రజల సమస్యల ను స్నేహ పూర్వకం గా తీర్చడమన్నా రు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించడం, ప్రజల అవసరాలను బట్టి పోలీసుల పని విధానంలో మార్పు తీసుకురావడం, పోలీసు శాఖలోని అన్ని స్థాయిల అధికారులు తమ నైపు ణ్యం పెంచుకొనేలా ప్రేరణ కలిగించడం, పోలీసు శాఖలోని అన్ని స్థా యిల అధికారులకు నాయకత్వ లక్షణాలను పెంపొందించడం వంటి పద్దతులను అవలంభించాలన్నారు. అనంతరం సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల ఎస్పీలు ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, చందనా దీప్తి, అన్నపూర్ణ లు మాట్లాడుతూ శాంతి భద్రతలను పటిష్టవంతం చేస్తామని అన్నారు.