Home తాజా వార్తలు జులై చివరి నాటికి పంచాయతీ ఎన్నికలు

జులై చివరి నాటికి పంచాయతీ ఎన్నికలు

nagireddy-image

హైదరాబాద్: వచ్చే జులై నెల చివరి నాటికి పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి అధికారులకు సూచించారు. పంచాయతీ ఎన్నికలపై బుధవారం ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పిలు, పంచాయతీ రాజ్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో సిఎస్ ఎస్ కె జోషి, డిజిపి మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడారు. శాంతియుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు పక్క ప్రణాళికలు రూపొందించాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేశామని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు 1.5 కోట్ల ఓటర్లు పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు. జూన్ 15 నాటికి ముద్రణా సామగ్రి సిద్ధమవుతుందన్నారు. బిసి ఓటర్ల గణన జూన్ 1 లోగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఎన్నికల తర్వాత పంచాయతీ కార్యదర్శుల బదిలీలు ఉంటాయని ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికలపై పోలీసులకు సమగ్ర అవగాహన ఉండాలని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. న్నికల సందర్భంగా శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని డిజిపి స్పష్టం చేశారు.