Home తాజా వార్తలు నియోజకవర్గాల వారీగా తెలంగాణ పిసిసి సమీక్షలు

నియోజకవర్గాల వారీగా తెలంగాణ పిసిసి సమీక్షలు

telangana pcc president Uttam kumar reddy

 

ఓటమి కారణాలపై అధిష్టానానికి నివేదిక
ఓటమికి చంద్రబాబు కారణం కాదు
తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి

హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో ఓటమికి ప్రేరేపించిన అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ దృష్టి సారించించింది. అందుబాటులో ఉన్న అనేక అవకాశాలను వినియోగించుకుని ప్రజాక్షేత్రంలో ప్రచారం చేసినా ప్రజలు ఎందుకు ప్రతికూలంగా స్పందించారో విశ్లేషించాలని తెలంగాణ పిసిసి నిర్ణయించింది. తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోగానే అధిష్ఠానానికి ప్రాథమిక నివేదిక ఇచ్చామని తెలంగాణ పిసిసి స్పష్టం చేసినా పూర్తి స్థాయి విశ్లేషణ చేయాలని ఆదేశించడంతో టిపిసిసి ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ సీనియర్ నాయకులు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు చంద్రబాబునాయుడు ప్రచారంతో తెలంగాణ సెంటిమెంట్ రగులుకుందని చెపుతున్నప్పటికీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం అంగీకరించడంలేదు. ఓటమికి చంద్రబాబు ప్రచారం కారణం కాదని స్పష్టం చేశారు.

నియోజకవర్గాలవారీగా లోతైన సమీక్షలు నిర్వహించిన తర్వాతే సమాధానం లభిస్తుందనే ధోరణిలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇదే అంశాన్ని శుక్రవారం టిపిసిసి చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విలేకరులతో కొద్దిసేపు ఇష్ఠాగోష్ఠిగా మాట్లాడుతూ.. స్పష్టం చేశారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఎఐసిసి ఆదేశాల మేరకు ఎన్నికల్లో తగిన వ్యూహంతో పోరాడినా ఓడిపోవడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ప్రజా క్షేత్రంలో స్పందన పార్టీకి అనువుగా ఉన్నప్పటికీ ఓటర్లు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్పందించడానికి ప్రేరేపించిన అంశాలను అన్వేషించాలన్నారు. మరో రెండు రోజుల్లో దశల వారీగా సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

నియోజకవర్గాలను యూనిట్‌గా తీసుకుని సమీక్షలు చేయడంతో పాటు మండలాలు, గ్రామాలను యూనిట్‌గా చేసుకుని సమీక్షలు నిర్వహించేందుకు పార్టీ ఆలోచిస్తుందన్నారు. ఎఐసిసి నాయకత్వానికి ఆంతరంగికంగా ఇచ్చిన తొలి నివేదికలో అనేక అంశాలను పేర్కొన్నట్లు తెలిపారు. ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చినప్పటికీ అనేక సందేహాలు ఉన్నాయన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు అవకాశాలు అత్యధికంగా ఉన్నాయనే ధీమాను వ్యక్తం చేశారు. అయితే శాసన సభ ఓటమి కారణాలు తిరిగి ఉత్పన్నం కాకుండా వ్యవహరిస్తేనే సాధ్యమవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Telangana PCC reviews by constituencies

Telangana Latest News