Home అంతర్జాతీయ వార్తలు శ్రీలంక పేలుళ్లలో తెలంగాణ వాసి మృతి

శ్రీలంక పేలుళ్లలో తెలంగాణ వాసి మృతి

Sri Lanka Blastsహైదరాబాద్‌: శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లలో తెలంగాణ వాసి మృతిచెందారు. చనిపోయిన వ్యక్తి అమీర్‌పేటకు చెందిన తులసీరాం(31)గా పోలీసులు గుర్తించారు. తులసీరాం హైదరాబాద్‌లో పైలట్‌ శిక్షణ తీసుకుంటున్నారు. విహార యాత్రకు ఆయన శ్రీలంకకు వెళ్లి బాంబు పేలుళ్లలో మృతి చెందాడు.  గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు తులసీరాం అమ్మమ్మ ఇంట్లో ఉన్న తులసీరాం తల్లి నళిని హైదరాబాద్‌కు చేరుకున్నారు. శ్రీలంకలో సంభవించిన వ‌రుస బాంబు పేలుళ్లలో 321 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. 500 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని శ్రీలంక పోలీసులు తెలిపారు. ఈ పేలుళ్ల ఘటనలు ప్రపంచ దేశాలను దిగ్ర్భాంతికి గురి చేశాయి.

Telangana Person Dead in Sri Lanka Blasts