Home తాజా వార్తలు ప్రపంచస్థాయిలో తెలంగాణ పోలీసులకు గుర్తింపు

ప్రపంచస్థాయిలో తెలంగాణ పోలీసులకు గుర్తింపు

djp

సిద్దిపేట ప్రతినిధి: సమాజా అభివృద్దికి శాంతిభద్రతలే పునాదని, ప్రపంచస్థాయిలో తెలంగాణ పోలీసుకు గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తున్నామని డిజిపి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట పోలీస్ కమీషనరేట్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి విలేకరులతో మాట్లాడారు. నూతన సంవత్సరంలో తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీలింగ్‌తో ముందుకు వెల్లడంతో పాటు అధునాతన సాంకేతికను అందిపుచ్చుకుని పనిచేస్తామన్నారు. సిఎం కేసీఆర్ గత మూడున్నర సంవత్సరాలుగా పోలీసు శాఖకు అన్ని రకాల మద్దతును ఇవ్వడమే కాకుండా పలు సూచనలు, సలహాలు ఇస్తుండటంతో అన్ని జిల్లాలో శాంతిభద్రతలు బావున్నాయని అన్నారు. తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డారని, కొత్త సంవత్సరంలో దీన్ని అదేస్థాయిలో ముందుకు తీసుకవెలతామని అన్నారు. తెలంగాణను శాంతిభద్రతల నిలయంగా చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. సిద్దిపేట కమీషనరేట్ పరిధిలో పోలీసు శాఖ అధ్వర్యంలో చేపట్టిన వివిధ పనుల పట్ల తాను సంతృప్తి చెందినట్టు తెలిపారు. అంతకు ముందు ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో కమీషరేట్ పరిధిలోని పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐజీ స్టీఫెన్ రవీంద్ర, సిపి వి.శివకుమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దుద్దెడ వద్ద నిర్మిస్తున్న నూతన పోలీస్ కమీషనరేట్ నిర్మాణ పనులను, కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని డిజిపి పరిశీలించారు.