Home తాజా వార్తలు ఎవరు అడ్డుపడినా ప్రాజెక్టులు కట్టి తీరుతాం: పల్లా

ఎవరు అడ్డుపడినా ప్రాజెక్టులు కట్టి తీరుతాం: పల్లా

Telangana Projects Constructed by KCR Government

హైదరాబాద్: ఎస్‌ఎల్‌బిసి సొరంగం మార్గం తవ్వడంతో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఎంఎల్‌సి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌లో 22.89 కిలో మీటర్లు మాత్రమే తవ్వామని, ప్రస్తుత పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలియజేశారు. తెలగాణ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదని, నాగార్జున సాగర్ ఆయకట్టులో రెండు, మూడేళ్లకు ఒక్క సారి పంట పండుతుందని, ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరానికి సాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలు గుడ్డిగా ఆరోపణలు చేయడం సరికాదని, పనులు చేయకపోయిన మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌దే అని ధ్వజమెత్తారు. కాళేశ్వరంను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ఎన్ని కేసులు వేసినా, అన్ని అనుమతులతో నిర్మాణ పనులు చేపట్టామని ప్రశంసించారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి లాంటి బ్లాక్‌మెయిలర్ ఎంత అడ్డుపడ్డా ప్రాజెక్టులు కట్టి తీరుతామని స్పష్టం చేశారు. పిచ్చి ఆరోపణలు చేస్తే రేవంత్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.