Home దునియా రైతా రుచులు

రైతా రుచులు

 Challa Charu

గుమ్మడి రైతా

కావలిసిన పదార్థాలు: గుమ్మడి కాయ ముక్కలు2 కప్పులు, పచ్చిమిర్చి2, పచ్చి కొబ్బరి ముక్కలు అరకప్పు, పెరుగు3 కప్పులు, ఉప్పు రుచికి తగినంత, పుట్నాలు1 టేబుల్ స్పూన్లు, నూనె 2 టీస్పూన్లు, శనగపప్పు 1టీ స్పూను, మినపప్పు1టీస్పూను, పసుపు అరటీస్పూను, కరివేపాకు 4 రెబ్బలు, ఆవాలు అర టీస్పూను.

తయారు చేసే విధానం: గుమ్మడి ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి, పుట్నాలు, కొబ్బరి గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి మిశ్రమం, ఉడికించిన గుమ్మడి ముక్కలు, ఉప్పు పెరుగులో వేసి కలపాలి. తర్వాత కడాయిలో నూనె వేసి మినప్పప్పు,శనగపప్పు, ఆవాలు, పసుపు, కరివేపాకులతో తాలింపు పెట్టి పెరుగు మిశ్రమంలో కలపాలి. ఈ రైతా బ్రెడ్‌తో చాలా బాగుంటుంది.

దానిమ్మ …

కావలిసిన పదార్థాలు: దానిమ్మ గింజలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప గుజ్జు 1 కప్పు, మీగడ లేని పెరుగు 1కప్పు, పచ్చిమిర్చి తరుగు 1టీస్పూను, కొత్తిమీర తరుగు 1 టేబుల్ స్పూను, పంచదార, ఉప్పు రుచికి తగినంత, చాట్‌మసాల అర టీస్పూను.

తయారు చేసే విధానం: పెరుగులో పంచదార, ఉప్పు కలిపి గిలకొట్టాలి. తర్వాత బంగాళదుంప గుజ్జు, పచ్చిమిర్చి తరుగు, దానిమ్మ గింజలు, చిటికెడు చాట్ మసాల వేసి బాగా కలపాలి. కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి తినేముందు చాట్ మసాల చల్లి, కొత్తిమీరతో అలంకరించాలి.

ముల్లంగి …

కావలిసిన పదార్థాలు : ముల్లంగి 2, టమాటో 1, ఉల్లిపాయ తరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, పెరుగు3 కప్పులు, ఎండుమిర్చి2, జీరాపొడి అరటీస్పూను, జీలకర్ర అరటీస్పూను.

తయారు చేసే విధానం: టమాటో, ఉల్లిపాయల్ని సన్నగా తరగాలి. ముల్లంగిని మాత్రం తురుముకోవాలి. పెరుగులో ఈ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. తర్వాత కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, జీరాపొడితో తాలింపు పెట్టి పెరుగు మిశ్రమంలో కలపాలి. ఈ రైతా చపాతీల్లోకి బాగుంటుంది.

 

Telangana Shakam Challa Charu