Home తాజా వార్తలు ఒడిశా చీకటి తొలగించారు…

ఒడిశా చీకటి తొలగించారు…

Telangana power employees

 

తుఫాను బాధిత రాష్ట్రంలో మన విద్యుత్ సిబ్బంది సేవలు భేష్

ఒడిశా సహాయ చర్యల్లో
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు

భువనేశ్వర్, పూరీ జిల్లాల్లో కరెంటు పునరుద్ధరణ
‘ఫణి’ తుఫానుతో 16 జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
వారం రోజుల్లో 34 కిలోమీటర్ల మేర కరెంటు లైన్లను పునరుద్ధరించిన రాష్ట్ర బృందం

హైదరాబాద్: సహాయ చర్యల్లో తెలంగాణ విద్యుత్ కార్మికు ల పనివేగంతో ఒడిషా లో కొన్ని ప్రాం తాల్లో కరెంటు సరఫ రా పునరుద్ధరించారు. భువనేశ్వర్‌తో పాటు చుట్టుపక్కల 34 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లను పునరుద్ధరించి, విద్యుత్ సరఫరాను ప్రారంభించారు. ఒడిషాలో తుఫాను తాకిడికి గురైన ప్రాంతాలలో తెలంగాణ విద్యుత్ సంస్థలు చేపట్టిన కరెం టు సరఫరా, పునరుద్ధరణ చర్యలు స త్ఫలితాలను ఇస్తున్నాయి. ఫణి తుఫాను ప్రభావంతో ఒడిషాలో కరెంటు స్త ంభాలు పడిపోయాయి. చా లా వంగిపోయాయి. ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోయాయి. లైన్లు తెగిపోయాయి. దీంతో ఒడిషాలోని 16 జి ల్లాల్లో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరా యం కలిగింది. కరెం టు సరఫరా పునరుద్ధరణ విషయంలో సా యం చేయాల్సిందిగా ఒరిస్సా ప్రభుత్వం తె లంగాణ ప్రభుత్వాన్ని కోరింది.

ముఖ్యమంత్రి కెసిఆర్ వెం టనే స్పందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ట్రాన్స్ కో సిఎండి డి.ప్రభాకర్ రావుతో మాట్లాడి కరెంటు పునరుద్ధరణ పనుల్లో భాగం పంచుకోవాలని కోరారు. దీంతో తెలంగాణ విద్యుత్ సంస్థలకు చెందిన దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు ప్రత్యేక వాహనాల ద్వారా ఈ నెల 7న ఒరిస్సా బయలుదేరి వెళ్లారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అవసరమైన సామాగ్రిని తమ వెంట తీసుకెళ్లారు. ఆహార సామాగ్రి, గుడారాలు కూడా వెంట తీసుకెళ్లారు. ఎక్కడ విధులు నిర్వర్తిస్తున్న వారు అక్కడే గుడారాలు వేసుకుని, వండుకుని తింటున్నారు. కరెంటు లైన్లకు అడ్డంగా పడిన చెట్లను తొలగించడం, కరెంటు స్తంభాలను లేపి నిలబెట్టడం, ఒరిగిపోయిన వాటిని సరిచేయడం, కూలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లను పునురుద్ధరించడం, చెడిపోయిన ట్రాన్స్ ఫార్మర్లను మరమ్మతు చేయడం, తెగిపోయిన వైర్ల స్థానంలో కొత్త వైర్లు బిగించడం లాంటి పనులు చేస్తున్నారు. మధ్యలో వర్షం ఆటంకపరుస్తున్నప్పటికీ నిర్విరామంగా పనులు చేస్తున్నారు. ఎస్.పి.డి.సి.ఎల్. ఎస్.ఇ. ఎల్. గోపయ్య పర్యవేక్షణలో పునరుద్దరణ చర్యలు జరుగుతున్నాయి.

తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల వేగవంతమైన పనితీరుతో ప్రధానంగా ఒడిషా రాజధాని భువనేశ్వర్‌తో పాటు పూరి జిల్లాల్లో కరెంటు సరఫరా పునరుద్ధరణ దాదాపుగా పూర్తయ్యింది. ఇప్పటి వరకు పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతంలో 34 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. 537 కరెంటు స్తంభాలను ఏర్పాటు చేశారు. దెబ్బతిన్న 74 ట్రాన్స్ ఫార్మర్లను మళ్లీ పనిచేసేలా చేశారు. మొత్తం మీద ఒడిషా రాజధాని భువనేశ్వర్ తో పాటు, పూరి జిల్లాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. తుఫానుతో ఎక్కువ నష్టం జరిగింది పూరీ జిల్లాలోనే కావగం గమనార్హం. తెలంగాణ ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడి పనిచేసి, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేస్తున్నరని కోర్దా కలెక్టర్ భూపేందర్ సింగ్ పూనియా కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ సరఫరా పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, కొద్ది రోజుల్లోనే పరిస్థితి మామూలు స్థితికి చేరుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.

ట్రాన్స్ కో సిఎండి ప్రశంసలు

కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందించేందుకు ప్రతికూల వాతావరణంలోనూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు శ్రమిస్తున్నారని ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రశంసించారు. ఒడిషాలో విద్యుత్ సరఫరా పునరుద్దరణకు తెలంగాణ సహకారం అవసరం ఉందని కోరగానే రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది ఉద్యోగులు తాము వెళ్తామని సిద్ధపడ్డారన్నారు. కేవలం కొన్ని గంటల సమయంలోనే అక్కడికి చేరుకుని, వర్షంలో కూడా రేయింబవళ్లు పనిచేసి సామాజిక బాధ్యత నెరవేర్చారన్నారు.

 

Telangana staff restore power in parts of Odisha