Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

మిషన్ కాకతీయ మీడియా అవార్డుల ప్రకటన

Mission-Kakatiya

హైదరాబాద్: మూడో విడత మిషన్ కాకతీయ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈటివి ప్రతినిధి కె.శ్రీశైలం (నిజామాబాద్)కు మొదటి బహుమతి, బి. గురుప్రసాద్ (టివి-1)కు రెండో బహుమతి, ఎస్.గోపినాథ్ రెడ్డి (సాక్షి)కి మూడో బహుమతిని ప్రభుత్వం ప్రకటించింది. వీరితోపాటు ఇద్దరు వీడియో జర్నలిస్టులకు స్పెషల్ జ్యూరీ బహుమతులను ప్రకటించింది. వీరిలో ఈటీవీ వీడియో జర్నలిస్టు డి.సూర్యనారాయణ, టివి-1 వీడియో జర్నలిస్టు అంజి ఉన్నారు.
అలాగే జ్యూరీ ప్రత్యేక బహుమతి దూరదర్శన్ (యాదగిరి)కి చెందిన శ్రీరాములు గౌడ్ ఎంపికయ్యారు. వ్యాసాల సంకలానికి గాను కాకతీయ విశ్వవిద్యాలయం సోషియాలజీ విభాగానికి జ్యూరీ ప్రత్యేక బహుమతి వరించింది. 2016 నవంబర్ జాతీయ సదస్సులో సోషియాలజీ విభాగం వ్యాసాల సంకలనానికిగాను ఈ బహుమతి లభించింది.

Telangana state announced 3rd Mission Kakatiya Media Awards

Comments

comments