Home వికారాబాద్ మైనార్టీల 12 శాతం రిజర్వేషన్‌కు సిఎం కెసిఆర్ కృషి

మైనార్టీల 12 శాతం రిజర్వేషన్‌కు సిఎం కెసిఆర్ కృషి

Telangana State give 12% reservation to minorities

మన తెలంగాణ/తాండూరు: ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ను కల్పించేందుకు కృషి చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. శనివారం ఈద్- ఉల్- ఫితర్ సందర్భంగా పట్టణ  శివారులో ఉన్న ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మైనార్టీలకు 12 శా తం రిజర్వేషన్ కల్పించేందుకురాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు.  అంతే కాకుండా రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం కోసం అధిక ని ధులు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా మైనార్టీ గురుకుల పాఠశాలలు,షాది ముబారక్ వంటి పథకాలతో మైనార్టీలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు.రంజాన్ సందర్బంగా జి ల్లాలో సుమారు 10 వేల మంది ముస్లిం సోదరులకు ప్రభుత్వం  దుస్తులు పంపిణీ చేసిందని తెలిపారు. అదే విధంగా తాండూరు పట్టణ శివారులో ఉన్న ఈద్గా అభివృద్ధికి మరో కోటి రూపాయలు మంజూరు చేస్తున్నామని చెప్పారు,గతంలో కూడా ఈద్గా అభివృద్ధికి ప్రహారి గోడ నిర్మాణానికి సైతం నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు.మైనార్టి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ ఎన్ని నిధులైనా విడుదల చేస్తున్నారని అన్నారు.అనంతరం మంత్రి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ సునితా సంపత్ కుమార్, మాజీ డిసిసిబి చైర్మన్ లకా్ష్మరెడ్డి,  సిపిఐ జిల్లా కార్యదర్శి జనార్ధన్ రెడ్డి,టిఆర్‌ఎస్ పట్ఠణ అధ్యక్షులు ఆబ్దుల్ రావూప్,నాయకు లు సంపత్‌కుమార్, జుబేర్‌లాల పాల్గొన్నారు.