Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

బంజారాల ”తీజ్ ” ఇక అధికారిక పండగ

Untitled-1.jpg476476సర్కార్ ప్రకటనతో ఆనందం, ముస్తాబవుతున్న గిరి తండాలు
సిర్పూర్(యు): బంజారాల తీజ్ పండుగ ఇక అధికారికంగా జరగనుంది. మంగళవారం నాటి ప్రభుత్వ ప్రకటనతో లంబాడి గిరిజనుల్లో ఆనందం వెల్లు వెరుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజనుల పండుగలను సాంప్రదాయ బద్దంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మన పండుగలు , మన సంస్కృతి పేరిట నిధులు కెటాయిస్తుండటంతో తండాల్లో పండగ వాతావరనం కనిపిస్తుంది.
పండుగకు ముందు సర్కార్ గుర్తింపు
మరో వారం పది రోజుల్లో తీజ్ జరుపుకునేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా సర్కార్ గుర్తింపుతో ఘనంగా జరగనుంది .ఇందు కోసం తండాలు ముతస్తామవుతున్నాయి. ప్రతీ యేట ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రావణ మాసంలోనే ఈ సంబరాలు షురూ కానున్నాయి. 9 రోజుల పాటు తండాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. శ్రావణంలో ప్రాంరభమై ఈ ఉత్సవాలు కృష్ణాష్టమితో ముగిస్తుంది.
ఏమిటి పండుగ విశీష్టత
05adsrp01p4దశాబ్దాల సంస్కృతికి ఆనవాలు అయినా బంజారా తీజ్ తండాల్లో ఎనలేని సంతోషాన్ని నింపుతుంది. అతివల పండుగగా పేరు గాంచిన ఈ ఉత్సవం గిరిజన తండాల్లో అంబరాన్ని తాకేటట్లు నిర్వహించనున్నారు. మొదటి రోజు గ్రామ పొలిమెరల్లోకి వెల్లి మట్టిని తీసుకువచ్చి గ్రామంలోని నాయక్ ఇంట్లో ప్రత్యేక పూజలతో, ఆ తరువాత గోదుమలను అందులో వేసి నైవేద్యాన్ని సమర్పిస్తారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి నృత్యాలు చేస్తారు. పాడి పంట , గొడ్డు, గోడ, ఇంటిల్లి పాది ఇలా గ్రామం మొత్తం బాగుండాలని ఆ దేవున్ని కోరుకుంటూ నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనలు కన్నుల పండుగగా ఉంటాయి. ఈ ఉత్సవాన్నే ప్రభుత్వం ఈ సారి అధికారికంగా నిర్వహిస్తూ నిధులు కెటాయించడంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి.05adsrp01p3

Comments

comments