Home నాగర్ కర్నూల్ సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయి

సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయి

 Telangana state government welfare schemes will win TRS

అచ్చంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభివృద్దికి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తాయని అచ్చంపేట మాజీ ఎంఎల్ఎ గువ్వల బాల్‌రాజ్ అన్నారు. శనివారం అచ్చంపేట నియోజక వర్గంలోని వివిద మండలాలనుండి గువ్వల బాల్‌రాజ్ సమక్షంలో వివిద పార్టీల కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఉప్పునుంతల మండలం పెనిమిళ్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తిరుపతయ్య గువ్వల బాల్‌రాజ్ సమక్షంలో పార్టీలో చేరారు. అదేవిదంగా బల్మూర్ మండలంలోని గోదల్ గ్రామంలో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలలో ప్రతి ఒక్కరు లబ్ది పొందారని సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం గ్రామానికి చెందిన దాదాపు 50 మంది యువకులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈకార్యక్రమంలో నేతలు రుక్మారెడ్డి, రవికుమార్, బూషన్న, ఖాద్రీ నాయక్, ఝాంగీర్, మశన్న, భ్రహ్మ చారి తదితరులు పాల్గొన్నారు.