Home తాజా వార్తలు ప్రగతి నివేదిక

ప్రగతి నివేదిక

Telangana State has completed four years

నేడు ప్రజల ముందు నాలుగేళ్ల అభివృద్ధి పత్రం సమర్పించనున్న ముఖ్యమంత్రి కెసిఆర్
నాలుగు సంవత్సరాలలో 423 పథకాలు

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడి నాలుగేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం చేయనున్న ప్రసంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సమైక్య రాష్ట్రంలో రాష్ట్రానికి జరిగిన తీవ్ర అన్యాయాన్ని చక్కదిద్దడంతో పాటు జనరంజక పాలనతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న ఈ నాలుగేళ్ళ ప్రయాణం ముఖ్యమంత్రి ప్రసంగంలో చోటుచేసుకోనుంది. గత మూడేళ్ళుగా ప్రతి జూన్ 2వ తేదీన జరుగుతున్న ఆవిర్భావ వేడుకలతో పోలిస్తే ఈసారి జరుగుతున్నవాటికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికల సంవత్సరం కావడం తో ఈ నాలుగేళ్ళ ప్రగతిని ప్రజల ముందు సాక్షాత్కరింపజేయడం రానున్న ఎన్నికలకు ఇది దాదాపుగా ఒక రకంగా మేనిఫెస్టోయేననే సాధారణ అభిప్రాయం వ్యక్తమవుతోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఉదయం 10 నుంచి 11.15 గంటల వరకు జరి గే ఈ వేడుకల్లో ముఖ్యమం త్రి కెసిఆర్ పావుగంటసేపు ప్రసంగించనున్నారు. సరిగ్గా 11 గంటలకు సిఎం ప్రసంగం ఉండేలా షె డ్యూలు రూపొందింది. తన ప్రసంగంలో సమైక్య రాష్ట్రంలో సాధ్యంకాని అనేక అంశాలు నాలుగేళ్లలోనే స్వరాష్ట్రంగా తెలంగాణ సాధించడం గురించి ప్రస్తావించడంతోపాటు ఇదే ప్రగతిని రానున్న కాలంలోనూ సాధించగలదన్న భరోసాను ప్రజల్లోకి తన సందేశం ద్వారా తీసుకెళ్ళే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు తాత్కాలిక భృతిని ప్రకటించడంతో పాటు సమీప భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టనున్న ‘రైతుబీమా’, ‘కంటి వెలుగు’, ‘హెల్త్ ప్రొఫైల్’ తదితర పలు సంక్షేమ పథకాల గురించి కూడా ప్రస్తావించనున్నారు. ఏయే రంగాల్లో తెలంగాణ ఈ నాలుగేళ్ళలోనే యావత్తు దేశంలో మొదటిస్థానంలో నిలిచిందో, ఎలాంటి వినూత్నమైన పథకాలను, కార్యక్రమాలను అమలుచేస్తూ ఉందో, ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా సాకారమవుతున్నాయో.. ఇలా అనేక విషయాలను తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది.
నాలుగేళ్ళలో 423 పథకాలు : రాష్ట్రం ఏర్పడేనాటికి ఒక్కో రంగంలోని పరిస్థితిని, ఇప్పుడు నాలుగేళ్ళ ప్రయాణం తర్వాత ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రభుత్వం ‘ప్రగతి నివేదిక’లో పొందుపర్చింది. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పలు పథకాలను కొనసాగించడంతో పాటు 2014 ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను ఏ విధంగా పూర్తిచేసిందీ, హామీలుగా ఇవ్వకున్నా ప్రస్తుతం అమలవుతున్న పథకాలనూ ఈ నివేదికలో కనిపిస్తాయి. ఇప్పుడు అమలవుతున్న పథకాల్లో దాదాపు 65 కేవలం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనవి. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు ఇప్పటివరకూ లేవు. చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ, ప్రతీ ఇంటికీ రక్షిత త్రాగునీటిని నల్లాల ద్వారా సరఫరా చేసే మిషన్ భగీరధ, పంట పెట్టుబడి సాయంగా ప్రతీ ఎకరానికి ఒక్కో సీజన్‌కు రూ. 4000 చొప్పున పట్టాదారులైన రైతులందరికీ ‘రైతుబంధు’, ఐదు లక్షల రూపాయల వరకు రైతులందరికీ ఉచిత ‘రైతుబీమా’, వ్యవసాయరంగానికి ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ‘రైతు సమన్వయ సమితి’, రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ కంటి వైద్య పరీక్షలు, ఆపరేషన్లను ఉచితంగా నిర్వహించే ‘కంటివెలుగు’, వధువులకు పెండ్లిఖర్చుల నిమిత్తం లక్షా నూటపదహారు రూపాయల ఆర్థిక సాయం చేసే ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీముబారక్’, పదిహేను రోజుల్లోనే 53 రకాల అనుమతులను మంజూరు చేయడానికి రూపొందించిన నూతన పారిశ్రామిక విధానం ‘టిఎస్ ఐపాస్’, ప్రతీ ఒక్కరికీ నెలకు ఆరు కిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉన్నా రేషను దుకాణాల ద్వారా అందిస్తున్న సబ్సిడీ బియ్యం… ఇలా 65 పథకాలు తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనవి. వినూత్నమైన, విప్లవాత్మకమైన ఇలాంటి పథకాలు అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండడం మాత్రమే కాకుండా తాజాగా ముగిసిన కర్నాటక ఎన్నికల్లో బిజెపి తన మానిఫెస్టోలో హామీగాలు పేర్కొనింది. అనేక పథకాలను స్వయంగా ప్రధాని మోడీతో పాటు నీతి ఆయోగ్ సిఇఒ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులు వివిధ సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. స్వయంగా వివిధ రాష్ట్రాల బృందాలు వచ్చి రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను అధ్యయనం చేసి వెళ్ళాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకానికి మన తెలంగాణలో వినియోగిస్తున్న ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ సాఫ్ట్‌వేర్‌ని వాడాలని నిర్ణయించడం విశేషం.
తెలంగాణ నెంబర్ వన్ :
రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్ళలో అనేక రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగింది. 45 ఏళ్ళలో సాధ్యంకాని అనేక పనుల్ని 45 నెలల్లోనే చేసి వివిధ రూపాల్లో ప్రశంసలు అందుకుంది. రాష్ట్రం ఏర్పడేనాటికి తలసరి ఆదాయం రూ. 1.12 లక్షలుగా ఉంటే ఇప్పుడది రూ. 1.75 లక్షలకు పెరిగి జాతీయ తలసరి ఆదాయంకంటే ఎక్కువే నమోదైంది. రాషట్రం ఏర్పడే నాటికి జిఎస్‌డిపి వృద్ధిరేటు 12.4%గా ఉంటే ఇప్పుడు 14%కంటే ఎక్కువే నమోదైంది. మొత్తం దేశీయ జిడిపిలో తెలంగాణ వాటా 10.4%గా ఉంది. సమైక్యరాష్ట్రంలో పదేళ్ళలో రూ. 1.29 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ నమోదైతే ఈ నాలుగేళ్ళలోనే రూ. 1.16 లక్షల కోట్ల మేరకు జరిగింది. పన్నుల రూపేణా కేంద్రానికి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 48,408 కోట్ల మేర ఆదాయాన్ని తెలంగాణ అందిస్తూ అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 21.1% మేర వృద్ధి సాధించింది. అన్ని రాష్ట్రాల నుంచి సగటున కేంద్రానికి ఆదాయాన్ని ఇస్తోంది కేవలం 16.7% మాత్రమే. రాష్ట్రం ఏర్పడేనాటికి పారిశ్రామికాభివృద్ధి మైనస్‌లో ఉంటే గత ఆర్థిక సంవత్సరానికి అది 13% మేర వృద్ధిచెందింది. వ్యవసాయాభివృద్ధిలో సైతం రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న 4% వృద్ధిరేటు గత ఆర్థిక సంవత్సరానికి 11%కి పెరిగింది. సులభ వాణిజ్య విధానంలో సైతం వరుసగా రెండేళ్ళుగా దేశంలోనే మన రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలిచింది. వినూత్నమైన టిఎస్ ఐపాస్ పారిశ్రామిక పాలసీని తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రానికి సుమారు 6820 పరిశ్రమల ద్వారా రూ. 1.28 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులురాగా, ఇందులో 4382 పరిశ్రమలు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించాయి. ప్రత్యక్షంగా 1.87 లక్షల మంది ఉపాధి అవకాశాలు పొందగా మరో 684 పరిశ్రమలు ప్రారంభమైతే 5.38 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
సాగునీటి రంగంలో ఆదర్శం : సమైక్యపాలనలో నీళ్ళకు జరిగిన అన్యాయం స్వరాష్ట్రంలో పునరావృతం కాకూడదని భావించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతీ పొలానికి నీరు అందించడానికి సాగునీటిరంగంపై తొలిరోజు నుంచీ దృష్టి సారించారు. గోదావరి, కృష్ణా జలాల్లో చట్టబద్ధంగా ఉన్న వాటామేరకు సైతం నీటి వినియోగం జరగడంలేదని గ్రహించి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు రీడిజైనింగ్ చేయడంతో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకుని గోదావరి నదిపై పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వాయువేగంతో జరుగుతూ ఉన్నాయి. కేంద్ర జల సంఘం ఛైర్మన్, ‘వాటర్ మాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్రసింగ్ లాంటి ఎంతో మంది స్వయంగా వచ్చి పనులను పరిశీలించి భారతదేశ సాగునీటిపారుదల ప్రాజెక్టుల చరిత్రలోనే కాళేశ్వరం నూతనాధ్యాయం అని వ్యాఖ్యానించారు. మిషన్ కాకతీయతో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం మాత్రమే కాకుండా భూగర్భజలమట్టం గణనీయంగా పెరిగింది. ఫలితంగా ఈ నాలుగేళ్ళలో రాష్ట్రంలో ఆహారధాన్యాల ఉత్పత్తి, ముఖ్యంగా వరి భారీ స్థాయిలో పెరిగింది. వివిధ రంగాల్లో బహుముఖ వ్యూహంతో తెలంగాణ రాష్ట్రం ఈ నాలుగేళ్ళలో చేసిన ప్రయాణం, సాధించిన అభివృద్ధి, ప్రజలకు కలిగిన ఫలితం తదితరాలన్నింటినీ ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రస్తా