Home నాగర్ కర్నూల్ బంగారు తెలంగాణ దిశగా: తెలంగాణ రాష్ట్రం

బంగారు తెలంగాణ దిశగా: తెలంగాణ రాష్ట్రం

Telangana state towards gold Telanganaవెల్దండ: రైతు బందు పథకం ద్వారా రైతులకు పంట సహయంగా ఎకరాకు 4వేల రూపాయలు ఇస్తున్న మన ముఖ్యమంత్రి కేసిఆర్, తెలంగాణ ప్రజల పాలిట తెలంగాణ గాంధిగా మారారని బంగారు తెలంగాణ దిశగా మన రాష్ట్రాన్ని తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి కేసిఆర్‌గారి అడుగు జాడలలో మనమందరం నడుద్దామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్న రైతు బంధు పథకం ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం 6వ రోజుకు చేరుకుంది. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మూద్ అలీ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రైతుసమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుకెందర్‌రెడ్డి, అచ్చంపేట ఎంఎల్‌ఏ గువ్వల బాల్‌రాజ్‌లు ముఖ్య అతిధులుగా వచ్చారు. హైదరాబాద్ నుండి హెలికాప్టరులో వెల్దండ మండల కేంద్రానికి వారికి మహబూబ్‌నగర్ ఎంఎల్‌సి కాశిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీదర్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గోళి శ్రీనివాస్‌రెడ్డి, కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ద్యాప విజితారెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ యెన్నం భూపతిరెడ్డిల ఆధ్వర్యంలో హెలికాప్టర్ వద్దకు వెళ్ళి వారికి పుష్ప గుచ్చం ఇచ్చి ఘనస్వాగతం పలికారు.అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునికంగా ప్రచురించిన పట్టాదార్ పాసు బుక్ ను, రైతు బంధు చెక్కులను వారు రైతులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బంధు పధకం ద్వారా రైతులను ఆదుకుంటున్న కేసిఆర్ రైతుల పాలిట బంధువుగా మారాడని, భూప్రక్షాలన కార్యక్రమం నిర్వహించి భూముల లెక్క తేల్చిన ఘనత దక్కుతుందని, భూప్రక్షాలనకు, చెక్కుల పంపిణీ గురించి రెవెన్యూ, వ్యవసాయ అధికారులు ఎంతో కష్టపడి పని చేశారని అన్నారు. రైతు బంధు పథకం ద్వారా చెక్కులు అందజేయడం చరితారత్మకమని అన్నారు. ఈకార్యక్రమంలో రెవెన్యూ శాఖ రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరి రాజేష్ తివారి, మాజీ ఎంఎల్‌ఏలు రాములు, జైపాల్‌యాదవ్, జెసి సురెందర్‌కరణ్, తెరాస రాష్ట్ర నాయకుడు బాలాజీ సింగ్, జడ్పీటీసి వావిళ్ల వెంకటమ్మ ఎంపిపిలు రాజశేఖర్, రామేశ్వరమ్మ పిఏసిఎస్, చైర్మెన్ మోహన్‌రెడ్డి, సర్పంచ్ చిందం లక్ష్మికృష్ణయ్య, తహసిల్దార్ సైదులు, నాయబ్ తహసిల్దార్ వెంకటరమణ, జడ్పీటీసి తనయుడు తెరాస తాలూకా నాయకుడు సంజీవ్‌కుమార్ యాదవ్, వైస్‌ఎంపిపి వెంకటయ్యగౌడ్, కోఆప్షన్ మెంబర్ యాకూబ్, నాయకులు సురెందరెడ్డి, ఆనంద్‌కుమార్,అర్జున్‌రావు, నారాయణ, బీమయ్యగౌడ్, శ్రీను నాయక్, వీరారెడ్డి, శేకర్, శంకర్‌నాయక్, ఆర్డిఓ రాజేష్‌కుమార్, ఎడిఏ శ్రీనివాస్‌రాజు, డిఎస్పి ఎల్‌సి నాయక్, ఏఓ మంజుల తదితరులు పాల్గొన్నారు.