Home తాజా వార్తలు తెలంగాణ తెలుగే అసలు తెలుగు : కడియం

తెలంగాణ తెలుగే అసలు తెలుగు : కడియం

KADIYAM

హైదరాబాద్ : తెలంగాణ తెలుగే అసలు తెలుగు అని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. ఈ విషయాన్ని ప్రపంచానికి చాటు చెబుదామని ఆయన పేర్కొన్నారు. రెండో రోజు ప్రపంచ తెలుగు మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. రవీంద్ర భారతిలో బృహత్ కవి సమ్మేళన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడారు. పెద్ద సంఖ్యలో కవులు హాజరయ్యారు. తెలంగాణ సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఈ సభలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆయన పేర్కొన్నారు. జనపదాలను పరిరక్షించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వరినాట్లు వేసేటప్పుడు, వడ్లు దంచేటప్పుడు పాడే పాటలు ఇప్పుడు కనుమరుగయ్యాయని, వాటిని మళ్లీ వెలుగులోకి తీసుకరావాలని ఆయన కవులకు విజ్ఞప్తి చేశారు.

Telangana Telugu is the original Telugu: Kadiyam