Home రాష్ట్ర వార్తలు తెలంగాణకు 5 ఉపాధి అవార్డులు

తెలంగాణకు 5 ఉపాధి అవార్డులు

Telangana-win-awards-for-MG

న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు లో అత్యుత్తమ ప్రగతి కనబర్చినందుకు జాతీయ స్థాయిలో తెలంగాణ కు ఐదు అవార్డులు దక్కాయి. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్య క్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేందర్ సింగ్ తోమర్, సహాయ మంత్రి రాంకృపాల్ యాదవ్ లు 2015-16సంవత్సరానికి గాను ఈ అవార్డులను అంద జేశారు. యువతకు ఉపాధి శిక్షణ, అవకాశాలు కల్పించ డంలో విశేష కృషి చేసినం దుకు దీనదయాల్ ఉపాధ్యా య గ్రామీణ కౌశల్య యోజన అవార్డును తెలంగాణ ఎం ప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీ ఎంయం) కైవసం చేసుకుంది. అలాగే జాతీయ స్థాయి లో నేషనల్ రిసోర్స్ ఆర్గనైజేషన్- నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఎన్ ఆర్వో-ఎన్ ఆర్‌ఎల్ యం) ఉత్తమ అ వార్డులను కూడా తెలంగాణ సెర్ప్ సొంతం చేసుకుంది.

కోరిన ప్రతి ఒక్కరికి జాబు కార్డు ను అందించడం… వికలాంగులకు, అంతరించి పోతున్న ఆదిమ తెగలకు ప్రత్యేక జాబ్ కార్డ్‌లు జారీ చేయడంతో పాటు కూలీలకు వేతన స్లిప్‌లను అందజేయడం, కూలీల ఖాతాలో వేతా నాలు జమకాగానే సంక్షిప్త సందేశాలు పంపించడము, సోషల్ ఆడిట్ కార్యక్రమాలు సమర్ధవంతంగా నిర్వ హిం చడం, ఉపాది పనులన్నింటిని కరపత్రముల ద్వారా ప్రా చారం చేయడం, ప్రత్యేక గ్రామీణ అభివృది కాల్ సెంట ర్ ద్వార పిర్యాదులు, పరిస్కారం వంటి కార్యక్రమాలకు గాను జాతీయ స్థాయిలో పారదర్శికత మరియు జవాబు దారీతనం కేటగిరి క్రింద తెలంగాణ అవార్డును కైవసం చేసుకుంది. అలాగే ఈ పథకంలో కల్పించిన అన్ని ఆస్తు లకు భువన్ సాఫ్ట్ వేర్ ద్వార జియో ట్యాగ్ చేయడం ద్వారా అంత్యంత ఎక్కువ ఆస్తులను కంప్యూట రీకరిం చినందుకు మరో జాతీయ అవార్డు తెలంగాణా ఖాతాలో పడింది.

ఈ అవార్డులను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ అందుకున్నారు. అత్యంత ఎ క్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించడం, సకాలం లో వేతనాల చెల్లింపులు చేయడం, అత్యధిక సరాసరి వేతనం చెల్లించినందుకు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అవార్డు అందుకున్నారు. అదే విధంగా ఉపాధి హామీలో క్రియాశీలకంగా వ్యవహరించి గ్రామంలో ఉన్న కూలీలలో ఎక్కువ మందికి పని కల్పిం చినందుకు నిజామాబాద్ జిల్లా మనోహరాబాద్ గ్రామ సర్పంచ్ తిరుపతి రెడ్డి అవార్డు అందుకున్నారు. ఉపాది హామీ పథకంలో పని చేసిన కూలీలకు సకాలంలో వేత నాలు చెల్లింపులు చేసినందుకు నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ఇందల్‌వాయి బ్రాంచ్ పోస్ట్ అబ్దుల్ స్త్తార్ అవార్డును అందుకున్నారు. డీడీయూ-జీకేవై, ఎన్ ఆర్వో-ఎన్ ఆర్ ఎల్‌యం కేటగిరీల్లో మరోరెండు అవా ర్డులు తెలంగాణాకే దాక్కాయి. ఎక్కువ మంది యువత కు నైపుణ్య శిక్షణనివ్వడం, ఉపాధి అవకాశాలు కల్పిం చిన రాష్ట్రంగానూ తెలంగాణ నిలిచింది.

దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అవార్డు కూడా తెలంగాణ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటిం గ్ మిషన్ (ఈజీయంయం) దక్కించుకుంది. అలాగే ఉత్త మ నేషనల్ రిసోర్స్ ఆర్గనైజేషన్-నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిష్‌న్ అవార్డును తెలంగాణా సెర్ప్ దక్కించు కుం ది. ఈ అవార్డును సెర్ప్ సీఈఓ పౌసమి బసు అందు కు న్నారు.పారదర్శకత,జవాబుదారీతనంలో, భవన్ సాఫ్ట్ వేర్ ద్వారా అన్‌లైన్‌లో నిక్షిప్తం చేసినందుకు, అత్యుత్త మ ప్రతిభ కనబరిచిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు, ఎక్కు వమంది కూలీలకు పని కల్పించిన మనోహరాబాద్ గ్రా మానికి, ఉత్తమ గ్రామపంచాయతీగా నిజామాబాద్ జిల్లా జాక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్ గ్రామానికి అవార్డు, ఉపాధి కూలీలకు సకాలంలో డబ్బులు చెల్లిం చి నందుకు నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి తపాల శాఖ ఉద్యోగి అబ్దుల్ సత్తార్‌కు, యువతకు ఉపాధి శిక్షణ, ఉద్యోగకల్పనకు గాను ఈజీఎంఎంకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అవార్డు లభించింది.