Home బిజినెస్ ఒత్తిడిలో టెలికాం రంగం

ఒత్తిడిలో టెలికాం రంగం

  • ఎస్‌బిఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య వెల్లడి

SBI-CHAIRMAN

కోల్‌కతా : టెలికాం రంగం ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని దేశంలోని అతిపెద్ద రుణ వితరణ సంస్థ, ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)’ చీఫ్ అరుంధతీ భట్టాచార్య శనివారం అన్నారు. దీనివల్ల నష్టాల బారిన పడకుండా ఎస్‌బిఐ కేటాయింపులు చేస్తోందని ఆమె తెలిపారు. ఇక్కడ న్యూటౌన్ వద్ద స్టేట్ బ్యాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆమె కాసేపు మాట్లాడారు. రియలన్స్ జియో స్కీమ్ దెబ్బకు ఇప్పటికే తలలుపట్టుకుంటున్న వొడాఫోన్, ఎయిర్‌టెల్, ఐడియా లాంటి ఆపరేటర్లపై ఐయుసి (ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జ్) ఛార్జీలను తగ్గించేందుకు ‘ట్రాయ్’ తీసుకున్న నిర్ణయం ప్రభావం చూపుతుందా? అన్న ప్రశ్నకు ఆమె పై విధంగా బదులిచ్చారు. శేష ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకు నిరర్థక ఆస్తుల (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్‌ఎన్‌పిఎ) అవుట్‌లుక్‌పై భట్టాచార్య మాట్లాడుతూ…‘బహుశా మేము అట్టడుగు స్థాయికి చేరుకుని ఉండొచ్చు. టెలికాం లాంటి కొత్త రం గాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ, బ్యాంకు ఒడిదుడుకులు మాత్రం నియంత్రణలోనే ఉన్నా యి’ అని ఆమె చెప్పారు. ఎస్‌బిఐ అనుబంధ బ్యాంకుల విలీనం ఒక నిర్మాణాత్మక సంస్కరణగా ఆమె అభివర్ణించారు. విలీనం తాలూకూ స త్ఫలితాలు కాలక్రమంలో సంక్రమిస్తాయని, ముందుగా హామీ ఇచ్చిన విధంగా దీనిని రాను న్న మూడ్నాలుగు త్రైమాసికాల్లో సాధించగలమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి అమలు తర్వాత ఆర్థికవ్యవస్థ తీ రుతెన్నులపై ఆమె మాట్లాడుతూ…మౌలిక సదుపాయాల అభివృద్ధి లాంటి కొన్ని భారీ కార్యక్రమాలను చేపట్టాలని ఆమె అన్నారు. స్టేట్ బ్యాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సంస్థ గురించి చెబుతూ…ఈ సంస్థ బ్యాంకింగ్, ఫైనాన్స్ పరం గా అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇ వ్వనుందన్నారు. ఇందులో ఎస్‌బిఐయేతర వ్యక్తులకు ప్రవేశాన్ని తాము అడ్డుకోబోమని, బ్యాంకిం గ్ ఫైనాన్స్ వృత్తినిపుణులందరూ ఆహ్వానితులేన ని ఆమె స్పష్టం చేశారు. బ్యాంకింగ్ పరిశ్రమలో నాయకత్వ హోదాని ఎస్‌బిఐ నిలబెట్టుకునేందు కు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో, అంకురసంస్థల కోసం ఒక సృజనాత్మక ల్యాబ్‌ను కూడా ఈ సం స్థ ఏర్పాటు చేయనుందని ఆమె తెలిపారు. ఇం దులో దాదాపు 240 మంది విద్యార్థులకు ఇక్కడ వసతులు కల్పిస్తామని ఆమె చెప్పారు.