Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

వినియోగదారులకు కాల్ డ్రాప్ జరిమానా చెల్లింపులు

call-dropన్యూఢిల్లీ: నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ బం ధుమిత్రులకు ఫోన్‌లో చెబుతుండగా కాల్‌డ్రాప్ అ యిందా? …అయితే చింతించకండి. ఇకపై ప్రతి కా ల్ డ్రాప్‌కు మీకు పరిహారం టెలికామ్ సర్సీస్ ప్రొవై డర్ల నుంచి అందుతుంది. ఒకవేళ రోజుకు 3 కాల్ డ్రాప్‌లు జరిగితే సర్వీస్ ప్రొవైడర్ ప్రతి కాల్ డ్రాప్ కు రూ. 1 చెల్లించక తప్పదు. జనవరి 1 నుంచే ఈ కాల్‌డ్రాప్ పరిహార చెల్లింపు ఉత్తర్వు అమలులోకి వ చ్చిందని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండి యా(ట్రాయ్) చైర్మన్ ఆర్‌ఎస్. శర్మ తెలిపారు. కాల్ డ్రాప్‌ల జరిమాన విధింపును ఆపేస్తూ స్టే ఇవ్వాలని టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు పెట్లుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు డిసెంబర్ 22న తిరస్కరించింది. అయితే కాల్ డ్రాప్‌లకు పరిహారం తప్పనిసరి చేస్తూ ట్రాయ్ జారీ చేసిన ఉత్తర్వును కొట్టేయాల్సిందిగా కోరుతూ సెల్యూలార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ద అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా, టెలికామ్ కంపెనీలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి కోర్టు విచారణ జనవరి 3కి  వాయిదా పడింది.

Comments

comments