Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రెండో పెళ్లి చేసుకున్న జోగినాయుడు

Telugu Actor Jogi Naidu Second Marriage

వ‌ర్ధ‌మాన సినీ న‌టుడు జోగి నాయుడు రెండో పెళ్లి చేసుకున్నారు. గురువారం అన్న‌వ‌రం శ్రీ స‌త్యనారాయ‌ణ స్వామి ఆల‌యంలో సౌజ‌న్య‌ అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఎపిలోని విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన జోగినాయుడు ప్రస్తుతం టాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్నారు. తొలుత ఒక యాంకర్‌ను వివాహం చేసుకున్నారు. ఆమెతో విడిపోయిన త‌ర్వాత కొన్నాళ్లు సింగిల్‌గానే ఉన్నారు. కాగా, తన గ్రామానికే చెందిన సౌజ‌న్య‌ని ఆయన నిన్న రెండో వివాహం చేసుకున్నారు. జోగి బ్ర‌ద‌ర్స్‌లో ఒక‌రైన జోగినాయుడు ప‌లు సినిమాల‌తో మంచి గుర్తింపు పొందారు.

 

Comments

comments