Home లైఫ్ స్టైల్ మీ మనస్సు కుశలమా?

మీ మనస్సు కుశలమా?

Mental Healthశరీరానికి అనారోగ్యం ఏర్పడినట్లే, మనసు అప్పుడప్పుడూ అనారోగ్యానికి లోనవుతుంటుంది. చెడు చేసినా, మంచి పనులు చేసినా దానికి మనసే కారణం అవుతుంది. మనసులో ఎన్నెన్నో భావాలు ఉంటాయి. అవసరమయినప్పుడు అవి బయటపడుతుంటాయి. కోపం, ద్వేషం, అనుగ్రహం, దయ, స్వానుభూతి, చిరాకు, అసహనం, విసుగు, ఆనందం, బాధ, ప్రేమ, అభిమానం, ఉదాసీనత, అశాంతిలాంటివన్నీ మనస్సు వ్యక్త పరుస్తుంది. ఎదుటివారి మాటలను బట్టి వారి మనసులో ఏముందో పసిగట్టడం కష్టం. మనస్సులో ఒకటి పెట్టుకుని, పైకి వేరే రకంగా మాట్లాడేవారు ఎందరో ఉంటారు. ఎదుటివారి మాటలను బట్టి, వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేం. వారితో సన్నిహితంగా మెలిగితే తప్ప వారు ఎటువంటి వారన్నదీ అర్థం కాదు.

‘మూడ్ బాగా లేదు’, ‘మనస్సు ఎందుకో బాధగా ఉంది’, ‘ఏ పనీ చేయబుద్ధి కావడం లేదు’, ‘పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి’… ఇట్లాంటి మాటలు చెప్పేవారి మనస్సుకు అనారోగ్యం కలిగిందని అర్థం చేసుకోవాలి. వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ‘ఒంట్లో బాగలేదు’ అని ఎవరైనా చెప్తే ‘డాక్టరు దగ్గరకు వెళ్లకపోయావా?’ అని అడుగుతారు. ‘మనసు బాగాలేదు’ అంటే డాక్టరుకు చూపించుకోకపోయావా? అని ఎవరూ అనరు. శరీర అనారోగ్యాలకు డాక్టరు ఉన్నట్లే, మానసిక అనారోగ్యాలకు కూడా వైద్యులు ఉన్నారు. మనస్సులో ఆందోళన, దిగులు, నిస్పృహ, నిరాశ కలిగితే మానసిక వైద్యునికి చూపించుకోవడానికి వెనుకంజ వేస్తారు. మనసు బాగుండకపోయినా నిర్లక్షంగా, అశ్రద్ధగానే ఉంటా రు. మానసిక సమస్యలను, మానసిక అనారోగ్యాలను తొలగించడానికి మనస్తత్వ వైద్య నిపుణులు, సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, హిప్నాటిస్టులు, కౌన్సిలింగ్ ద్వారా వారి మానసిక అనారోగ్యాన్ని తొలగించే డాక్టర్లు ఎందరో ఉన్నప్పటికీ, వారిని సంప్రదించడానికి, వారి సహాయాన్ని పొందడానికీ బిడియపడతారు.

మానసికంగా కుంగిపోతూ, మానసిక అనారోగ్యాన్ని పెంచుకుంటూ, డిప్రెషన్‌తో బాధపడతారే కానీ మానసిక వైద్యుని వద్దకు వెళ్లరు. మానసిక వైద్యుని సంప్రదించామని ఎవరికైనా తెలిస్తే తమను పిచ్చివారిగా జమకడతారనే భ యం వారిలో అంతర్లీనంగా ఉంటుంది. మనస్సుకు కూడా అ నారోగ్యాలు ఏర్పడతాయని తెలుసుకోవాలి. ముందుగా డిప్రెషన్, టెన్షన్, ఫోబియా స్ట్రెస్, ఇల్యూషన్స్, డైమెన్షియా, హిస్టీరియా, పారనాయిడ్స్, డిజార్డర్స్, ఫోబియాలలో కూడా ఎన్నో రకాలున్నాయి.
మనిషిలో గూడుకట్టుకున్న భయాలే ఫోబియా లు. ఇవి కూడా ఎన్నెన్నో రకాలున్నాయి. బాల్యంలో ఉండే ఫోబియాలో వయస్సు పెరుగుతుంటే తగ్గిపోయే అవకాశం ఉంది. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు, వ్యతిరేక పరిస్ధితులు, వ్యతిరేకపు ఆలోచనలు, బాధలు మానసికంగా కుంగదీస్తూ, క్రమేపి మానసిక అనారోగ్యానికి దారితీయవచ్చు. కొందరు స్వల్ప విషయానికే స్పందిస్తూ, చిన్న విషయాలకే చలించిపోతూ మానసిక ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటారు.

మరి కొందరు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా గుండె నిబ్బరంతో, మనోధైర్యంతో, ఆత్మ విశ్వాసంతో వాటిని తొలగించుకుంటూ మానసిక ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారు. వారి ఆలోచనా తీరు, వారి మానసిక శక్తి వారికి తోడ్పడతా యి. ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని, ఆ పరిష్కార మార్గం దిశగా ఆలోచిస్తూ, ఆ సమస్య ఎందుకు ఏర్పడిం దో, దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోగలమా అన్న కోణంలో ఆలోచించి అన్ని రకాలుగా విశ్లేషించుకొని, ఆ సమస్యను తొలగించుకోవ డం ద్వారా వారికి మానసిక ఆరోగ్యం కుంటుపడదు. వారంతట వారే తమ మానసిక ఆరోగ్యాన్ని సరిచేసుకోలేరు. అందువల్ల వారి మానసిక స్థితిని గుర్తించి, వారిని ప్రోత్సహిస్తూ, వారిలోని భయాలను పోగొట్టవలసిన బాధ్యత పెద్దలదే. వారి మానసిక స్థితిని పెద్దలు సరిదిద్దకపోతే వారు మానసిక వైకల్యంతో బాధపడతారు.

టీనేజ్‌లో మానసిక వైకల్యం, ఉదాశీనత, మానసి క అనారోగ్యం కలగటానికి అనేక కారణాలు ఉన్నాయి. కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్, ప్రేమలో అపజయం పొందటం, తా ను మనసారా ఇష్టపడే వ్యక్తి తనను నిరాదరణ చేయడం, ఎదుటివారు గుర్తింపును పొందటం, ఎదుటివారు తమకంటే అందంగా ఆనందంగా హుషారుగా ఉండటం, తల్లిదండ్రులు కట్టుబాట్లు విధిస్తూ, తగినంత స్వేచ్ఛను ఇవ్వకపోవ డం, ఫ్రెండ్స్ మధ్య ఏర్పడే అపార్థాలు, పోటీ తత్వం, ర్యాం కులు సంపాదించలేకపోవడం, చదువుల ఒత్తిడి, తాము చేసే ప్రతిపనిలో, ప్రవర్తనలో పెద్దలు తప్పు పట్టడం లాంటి ఎన్నె న్నో కారణాలు టీనేజ్ పిల్లల మనస్సుకు ఇబ్బందిని కలిగిస్తూ, మానసిక ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తూ, మనస్సు ఆరోగ్యానికి అవరోధం కలిగిస్తాయి. అందువల్ల, టీనేజ్ పిల్లల నడవ డి, ప్రవర్తనను పెద్దలు ఓ కంట కనిపెడుతూ, వారిలో మానసి క ఎదుగుదల, ధైర్యాన్ని, మంచి వ్యక్తిత్వాన్ని కలిగించాలి.

యువతీయువకులలో కూడా మానసిక డిప్రెషన్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగం, ప్రేమించిన వ్యక్తి తనకు దూరమవటం, భగ్నప్రేమ, దాంపత్య జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు, కుటుంబ సభ్యులతో ఏర్పడే కలతలు, కలహాలు, పిరికితనంలాంటి కారణాలు యువతీ యువకుల మనస్సులను బాధిస్తూ, తీవ్రమయిన మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి. వాటిని దూరం చేసుకోలేకపోతే డిప్రెషన్‌కు లోనయి, మానసిక అనారోగ్యం ఏర్పడుతుంది. పురుషులలో కుటుంబ సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు, ఆఫీసులో బాస్ చిటపటలు, ప్రమోషన్ రాక పోవడం, ఆఫీసులో అధిక పనులు, అప్పులు, బదిలీల వల్ల కుటుంబాని కి దూరంగా ఉండటం, అధిక ఖర్చులు, ఆఫీసులో కొలీగ్స్‌తో ఏర్పడే సమస్యలు, భార్యాభర్తల మధ్య ఏర్పడే గొడవలు, పె ద్దల అనారోగ్యం లాంటివి పురుషుల మనస్సులను వేధిస్తూ వారిలో డిప్రెషన్‌ను కలిగిస్తాయి.

కొంత మంది తమకు ఏ కష్టమూ లేనట్లే, అం దరి మధ్యా నవ్వుతూ, చలాకీగా మాట్లాడుతూ తమ బాధల ను మనస్సులోనే అణగదొక్కేస్తారు. కానీ, అలా ప్రవర్తించడం మంచి విషయం మాత్రం కాదు. బాధను తమ సన్నిహితులతో పంచుకుంటే మనస్సు తేలికవుతుంది. బాధను కన్నీటి ద్వారా బయటకు పంపితే, మనస్సుకు ఉపశమనం లభిస్తుంది. ఎదు టి వారి ఓదార్పు, మనసు గాయపడిన వారికి, బాధలు కష్టా ల్లో ఉన్నవారికి దివౌషధంలా పనిచేస్తుంది. మనసుకు ఊరట కలుగుతుంది. తమను అర్ధం చేసుకుని ఆదుకునే, ఓదార్పుని చ్చే ఆత్మీయులు ప్రతివారికీ ఉండాలి. బంధాలు, అనుబంధా లు కష్టకాలంలో చేయూతను, మానసిక ధైర్యాన్ని అందించేందుకు తోడ్పడాలి. బాధపడే విషయాలను విస్మరించాలి. వాటి ని పదేపదే తలచుకుంటూ, మానసిక ఆరోగ్యాన్ని చేతులారా చెడగొట్టుకోకూడదు. ఆత్మన్యూనతను అధిగమించాలి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. ‘మనస్సు బాగాలేదు’ అనుకునేకంటే బాగాలేని మనస్సును ఉల్లాసంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. మనస్సు బాగుంటేనే శారీరక ఆరోగ్యమూ బాగుంటుంది. జీవితమూ సుఖంగా ఉంటుందని తెలుసుకోవాలి.

-కేతా నిరల

Telugu Essay on Mental Health Conditions