Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

కత్తి విజయవాడకు షిఫ్ట్..!

Telugu film Critic Mahesh Kathi shifted to Vijayawada

అమరావతి: హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ క్రిటిక్ కత్తి మహేష్‌పై ఆరు నెలలపాటు హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో గత కొంత కాలంగా మహేశ్ బెంగళూరులో ఉంటున్నాడు. అయితే, సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో కత్తి  మీడియాతో మాట్లాడారు. తాను ఇకపై విజయవాడలోనే నివాసముంటున్నట్లు స్పష్టం చేశాడు. తనది ఆంధ్రప్రదేశేనని మహేశ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను విజయవాడకు షిఫ్ట్ అవుతున్నట్లు తెలిపాడు.  కాగా, తనపై హైదరాబాద్ నగరంలోకి వెళ్లకుండా మాత్రమే నిషేధం విధించారని, మిగతా తెలంగాణలో ఎక్కడైనా స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఉందని చెప్పాడు.

ఇక హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌పై  చర్యలు తీసుకోవాలని హిందూ జనశక్తి నేతలు ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ … రామాయణం అనేది ఓ కథ అని, రాముడనే వ్యక్తి ఎంత ఆదర్శవంతుడో, అంత దగుల్బాజీ అని ఆయన వ్యాఖ్యానించారు. రావణుడితోనే సీత ఉంటే ఆమె బాగుండేదేమోనని, ఆమెకు న్యాయం జరిగేదేమోనని తాను భావిస్తున్నట్టు కత్తి పేర్కొన్నారు. దీంతో కత్తిపై ఆరు నెలలపాటు హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేశారు.

Comments

comments