Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కెసిఆర్ కు టాలీవుడ్ లేఖ!

KCR-Tollywood

హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భాగంగా జరుగుతున్న విచారణను హుందాగా ముందుకు తీసుకెళ్లాలని తెలుగు సినీ పరిశ్రమ తరఫున ముఖ్యమంత్రి కెసిఆర్ కు లేఖ రాశారు . సినీ పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని లేఖలో టాలీవుడ్ వినతి చేసింది. డ్రగ్స్ కేసు ప్రభావం కారణంగా సినీ పరిశ్రమలో ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయని, చాలా వరకు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని, కాబట్టి ఈ కేసును సున్నితంగా పరిష్కరించాలని సినీ పరిశ్రమ కెసిఆర్ ను కోరింది. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ కి సంబంధించిన వ్యక్తుల విచారణ జరిగిన పది రోజులు పరిశ్రమకి చీకటి రోజులని లేఖలో పేర్కొన్నారు. డ్రగ్స్ వాడుతున్నవారి మేమే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులకు ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలుగు సినీ పరిశ్రమ లేఖలో స్పష్టం చేసింది.

Comments

comments