Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ప్రియమణి తో తరుణ్ పెళ్లి?

tarun and priyamani to get married

తరుణ్, ప్రియమణి పెళ్లి చేసుకోబోతున్నారట? అదేంటి… ప్రియమణి… చెన్నై కి చెందిన బిజినెస్ మెన్ ముస్తఫా ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది కదా. మళ్లీ ఇప్పుడు తరుణ్ ను పెళ్లి చేసుకుంటుందా అనే అనుమానాలు వస్తున్నాయా?

అయితే, మ్యాటర్ మొత్తం చదవండి… ప్రియమణి టాప్ హీరోయిన్ గా ఉన్న రోజుల్లోనే తరుణ్ ను పెళ్లి చేసుకుంటుందంటూ వదంతులు చాలానే వచ్చాయి. అంతే కాదు…ప్రియమణి కి అప్పట్లో ఓ వ్యక్తి ఫోన్ చేసి తరుణ్ ను పెళ్లి చేసుకుంటున్నారట కదా… తరుణ్ ఓ ఖరీదైన కారు కూడా గిఫ్ట్ గా ఇచ్చాడంట అంటూ ప్రియమణి ని అడిగాడట.

ఆ విషయాన్ని ప్రియమణి రీసెంట్ గా ఓ షోలో చెప్పింది. అది మ్యాటర్. అప్పటి విషయాలను వదిలేస్తే… ఇప్పుడు మాత్రం ప్రియమణి చెన్నై బిజినెస్ మెన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతుందట. ఎలాగూ ఇప్పుడు సినిమా అవకాశాలూ లేకపోవడంతో… తొందరలోనే పెళ్లి కూడా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నదట చిన్నది.

Comments

comments