Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

హాలీవుడ్‌కు మీరాచోప్రా?

Meera Chopra to act in Hollywood Movies

పవన్‌కళ్యాణ్ హీరోగా చేసిన ‘బంగారం’లో బాలీవుడ్ తార మీరా చోప్రా ఓ హీరోయిన్‌గా చేసింది. నితిన్‌తోనూ ఆమె ఓ సినిమాలో నటించింది. కానీ సక్సెస్‌లు అందుకోలేకపోయిన ఈ అమ్మడికి తెలుగు, తమిళంలో ‘ఐరన్ లెగ్’ అనే ఇమేజ్ వచ్చింది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మీరా చోప్రా… స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు బంధువు కూడా. ఆ బంధుత్వంతోనే మీరాను హాలీవుడ్‌కు తీసుకెళ్తోందట ప్రియాంక.

‘క్వాంటికో’ అనే టివి షోలో ప్రియాంక నటిస్తుండగా… అలాంటిదే మరో ఆఫర్ తన వద్దకు వచ్చిందట. ఈ ఆఫర్‌ను మీరా చోప్రాకు ఇవ్వాలనుకుంటోందట. బాలీవుడ్‌లో ఇప్పటికే కొన్ని సినిమాలు చేసిన మీరా చోప్రాకు అక్కడ పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. మరి ప్రియాంక చలవతో మీరా చోప్రా హాలీవుడ్‌కు వెళ్తుందా అనేది చూడాల్సిందే.

Comments

comments