Home సూర్యాపేట ప్రపంచంలోనే రెండో లిపిగా తెలుగు

ప్రపంచంలోనే రెండో లిపిగా తెలుగు

stage

*మాతృభాషను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రతి ఒక్కరూ
కృషి చేయాలి
*ఆంధ్ర పాలనలో తెలంగాణ కవులు, రచయితల గొంతు మూగబోయిందని ఆవేదన
* సూర్యాపేటలో
 మంత్రి జగదీష్‌రెడ్డి

మన తెలంగాణ/సూర్యాపేట ః మాతృభాష మమకారాన్ని విజ్ఞానవంతులు ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆకాంక్షించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన తెలుగు భాష ప్రాముఖ్యతపై సదస్సుకు మంత్రి ముఖ్య అతిధిగా హాజరై ప్రసం గించారు. గొప్ప కవులు ఉన్న తెలంగాణలో నాటి ఆంధ్ర పాలకులు తెలంగాణ బాష, సంస్కృతిని అణగదొక్కారని ఆవేదన వ్యక్తపరిచారు. రాష్ట్రం సిద్ధించాక తెలంగాణ యాస, భాషపై పట్టు సాధించిన సిఎం కేసిఆర్ , తెలంగాణ కవులు, రచయితలకు పెద్ద పీట వేశారని అభిప్రాయపడ్డారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణ దేవరాయల చరిత్రలను వివరించారు. మాతృభాషను ప్రపం చానికి చాటి చెప్పే విధంగా అద్భుతమైన, అలంకరణీ యమైన పదాలను జోడి స్తూ తెలంగాణ కవులు బోధిస్తున్న కవిత్వాలను చూస్తే ముచ్చటేస్తుం దన్నారు. ప్రపంచంలోనే రెండవ అందమైన లిపి, భాషగా పేరు ప్రఖ్యాతులు తెలుగు భాష గడించిందని ఉద్భోదించారు. ప్రావీణ్యం కోసం ఆంగ్ల భాషను పెంచుకోవాలే తప్ప తెలుగు భాషను కించపరచరాదని సూచించారు. ప్రకృతిలో జీవిస్తూ , సంఘర్షిస్తూ తమ జీవన వికాసానికి తోడ్పడే విధంగా ప్రకృతిని మలుచు కుంటూ మానవుడు సాగించే జీవన ప్రయాణంలో, అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న అద్వితీయమైనదే భాష యొక్క ప్రాధాన్యత అని విపులంగా మంత్రి వివరించారు.కొత్త పదాలు, ఇతర భాష పదాల జోడింపు, నూతన పదబంధాలతో భాషలు తన ప్రాధాన్యతను సంతరించుకుంటాయని అభిప్రాయ పడ్డారు. అంతర్గత వలన పాలనలో తెలంగాణ భాష, యాస, నుడి కారం అవ మానానికి గురై ఆంధ్ర యాస అలంకార ప్రాయంగా స్వీకరించ బడిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్‌కుమార్, జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్, జిల్లా ఎస్పి ప్రకాష్‌జాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ నేరేళ్ల లక్ష్మి, జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి బి.వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్‌లు తాహెర్ పాష, గండూరి రమేష్, గండూరి పావని, కల్లేపల్లి మహేశ్వరి, నాయకులు బడుగుల లింగయ్యయాదవ్, కట్కూరి గన్నా రెడ్డి, ఉప్పల ఆనంద్, నృత్యకారులు పేరిని వెంకట్, వెన్నెల పాల్గొన్నారు.
అభివృద్ధిపనులకు శంకుస్థాపన
సూర్యాపేట మండల పరిధిలోని కాసరబాద క్రాస్ రోడ్డులో గల అపూర్వ బధిరుల(మూగ, చెవిటి) రెసిడెన్షియల్ పాఠశాలలో అదనపు తరగతిగదుల భవనాలను మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కుప్పిరెడ్డి గ్రామంలో రూ. 7లక్షల 50వేలు వ్యయంతో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను, రూ.5లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మంత్రి వెంట ఎమ్మె ల్యే గాదరి కిశోర్, జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్, ఎంపిపి జానయ్య ఉన్నారు.