Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

అమెరికాలో తెలుగు యువకుడు మృతి

Telugu Man Died in America

ఇండియానా: అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగు యువకుడు మృతి చెందాడు. స్నేహితులతో కలిసి సరదాగా బోటింగ్‌కు వెళ్లిన అనూప్ తోట అనే యువకుడు ప్రమాదవశాత్తు మాన్రో సరస్సులో పడి మృత్యువాత పడ్డాడు. ఇండియానాలోని బ్లూమింగ్‌టౌన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, బోటింగ్‌ అనంతరం అనూప్ ఈత కొట్టాడని ఈ క్రమంలో సరస్సులో గల్లంతైనట్లు తోటి స్నేహితులు చెప్పారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి అనూప్ మృతదేహాన్ని వెలికి తీసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments