కృష్ణ, నేహా రెడ్డి హీరోహీరోయిన్లుగా శ్రీ జయలక్ష్మి ఆర్ట్ బ్యానర్‌పై నంది వెంకట రెడ్డి దర్శకత్వంలో సింహాద్రి గణేష్ నిర్మిస్తున్న చిత్రం ‘యాక్సిడెంట్’. విజ య్ బాలాజీ సంగీతమందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రతాని రామకృష్ణగౌడ్ ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి దాదాపు ఐదు వేల యాక్సిండెట్లు జరుగుతున్నాయి. ఇలాంటి యాక్సిం డెంట్ల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. సమాజానికి ఉప యోగపడే సినిమా ఇది’ అని చెప్పారు. నిర్మాత సింహాద్రి గణేష్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు అను గుణంగా హార్రర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను జోడించి సిని మా చేశాం. దర్శకుడు వెంకట్‌రెడ్డి సినిమాను అద్భుతం గా తెరకెక్కించారు’ అని అన్నారు. దర్శకుడు నంది వెంక ట్ రెడ్డి మాట్లాడుతూ ‘సమాజంలో జరుగుతున్న యాక్సిడెంట్ల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయ నే కాన్సెప్ట్‌తో చేసిన సినిమా ఇది. హీరోహీరోయిన్లు అద్భుతంగా నటించారు’ అని చెప్పారు. ఈ కార్య క్రమం లో సాయి వెంకట్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది. వడ్డేపల్లి నవీన్, శ్రీదేవి, నిషా, వెంకటేష్, హరీష్, పవన్, రచ్చరవి, హనీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: డి.యాదగిరి, ఎడిటర్: సంతోష్.