Home తాజా వార్తలు తెలుగు అమలు తేదీ నోటిఫికేషన్ విడుదల…

తెలుగు అమలు తేదీ నోటిఫికేషన్ విడుదల…

Kcr-image

హైదరాబాద్: 2018-19 విద్యా సంవత్సరం నుంచి తెలుగు బోధన తప్పనిసిరి చేస్తూ, దీనికి సంబంధించిన చట్టం అమలు తేదీని మంగళవారం తెలంగాణ సర్కార్ వెల్లడించింది. ఈ చట్టం ఏప్పిల్ 2 నుంచి అమలులోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా తెలుగు అమలు తేదీని ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగు భాషను తప్పనిసరి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కెసిఆర్ కొద్ది రోజుల కిందట ఆదేశించిన విషయం విదితమే. తెలుగు భాషా బోధన సిలబస్ తయారీ బాధ్యతను తెలుగు యూనివర్సిటీ, తెలంగాణ సాహిత్య అకాడమీలకు అప్పగించారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయిలో బోధించే తెలుగు సబ్జెక్టుకు సంబంధించి సిలబస్ ఏర్పాటు చేసి, పుస్తకాలు ముద్రించాలని సిఎం అధికారులకు ఆదేశాలు జారీచేశారు.