Home జాతీయ వార్తలు అమెరికాలో ఎపి వాసి మృతి

అమెరికాలో ఎపి వాసి మృతి

Telugu Software Engineer Died in America

వాషింగ్టన్ : అమెరికాలో ఎపికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం పెరుగ్గూడెంకు చెందిన బోళ్ల వీర వెంకట సురేశ్ (35) అమెరికాలోని మేరీల్యాండ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఆయన మృతి చెందినట్టు కుటుంబానికి సమాచారం వచ్చింది. సురేశ్ మృతికి దారితీసిన కారణాలు తెలియరాలేదు. చెన్నయ్‌లో బిటెక్ పూర్తి చేసిన సురేశ్ అక్కడే ఉన్న రెనాల్ట్ కంపెనీలో కొంతకాలం పని చేశారు. అనంతరం హైదరాబాద్ టిసిఎస్‌లో పని చేశారు. రెండేళ్ల క్రితమే ఆయన అమెరికా వెళ్లారు. సురేశ్ మృతితో పెరుగ్గూడెంలో విషాదం అలుముకుంది.

Telugu Software Engineer Died in America