Search
Saturday 22 September 2018
  • :
  • :

నానికి అక్కగా నటించనున్న స్టార్ హీరోయిన్…?

telugu star heroine bhumika to act as nani sister in nataraj movie

తెలుగు ఇండస్ట్రీలో సహజ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొని వరస హిట్లతో దూసుకుపోతున్న హీరో నాని. ఆయన నటించిన సినిమాల్లో దాదాపు హిట్ల శాతమే ఎక్కువ. రీసెంట్ గా నేను లోకల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని.. తాజాగా మరో మూవీకి సైన్ చేశాడట. ఆ మూవీలో నాని అక్క పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉందట. అందుకే నానికి అక్కగా నటించేందుకు ఓ స్టార్ హీరోయిన్ ను సంప్రదించిందట మూవీ యూనిట్… ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరనేగా మీ డౌట్…?

ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. ఒక్కడు సినిమా లో మహేశ్ సరసన నటించి, పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో మధుగా మెప్పించిన భామ భూమిక. అవును.. భూమిక అయితేనే ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతుందని ఆమెను సంప్రదించిందట మూవీ యూనిట్. భూమిక కూడా ఓకే చెప్పిందని ఇండస్ట్రీ టాక్.

మూవీ పేరు కూడా నటరాజ్ పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. పెళ్లయిన తర్వాత దాదాపు సినిమా రంగానికి దూరమైన భూమిక మళ్లీ మేకప్ వేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో… ఇక భూమిక కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసినట్లేనని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు.

Comments

comments