Home తాజా వార్తలు ఝాన్సీ ఆత్మహత్యలో కొత్త కోణం

ఝాన్సీ ఆత్మహత్యలో కొత్త కోణం

telugu tv actress jhansi suicide case Police investigation

మన తెలంగాణ/హైదరాబాద్ : బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఝాన్సీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఝాన్సీ కాల్‌డేటా, వాట్సాప్ చాటింగ్ సంభాషణలపై పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు. ఆమె ప్రియుడు సూర్యతేజ ప్రమేయంపై దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఝాన్సీ ఆత్మహత్య కేసు విషయంలో మరిన్ని విషయాలు రాబట్టేందుకు ఆమె ప్రియుడు సూర్యతేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఝాన్సీ సెల్‌ఫోన్ లాక్‌ను ఓపెన్ చేసిన పోలీసులు ఆమె ప్రియునితో చేసిన చాటింగ్ డేటాను రికవరీ చేశారు. మృతురాలి సెల్ ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లను పరిశీలిస్తున్నారు. గతంలో ఝాన్సీ చేసిన వాట్సప్ చాటింగ్ మెసేజ్‌లతో పాటు కొన్ని వీడియోలను గుర్తించినట్లు పంజాగుట్ట ఎసిపి తెలిపారు. వాటి ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నామని ఆయన వివరించారు.

శ్రీనగర్ కాలనీలో సాయి అపార్ట్‌మెంట్‌లోని తన నివాసంలో వర్థమాన సీరియల్ నటి ఝాన్సీ ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడడం అటు సినీ, ఇటు బుల్లితెర వర్గాల్లో సంచలనం రేపింది. సూర్యతేజ అనే యువకునితో ఝాన్సీ ప్రేమాయణం సాగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సూర్యాతో ఝాన్సీ సహజీవనం కూడా చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన విభేదాల వల్లే జీవితంపై విరక్తి చెంది ఝాన్సీ బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా ఝాన్సీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ ఫోన్‌లో వీడియోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఝాన్సీ బలన్మరణంలో వీడియో సెల్ఫీ ఈ కేసుకు కీలకంగా మారిందని, ఝాన్సీతో ప్రేయాయణం నడిపిన సూర్యాను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారన్నది సమాచారం. ఇటీవల కాలంలో సూర్యతేజ తన ప్రియురాలు ఝాన్సితో అంటీముట్టనట్లుగా వ్యవహరించడంతో పాటు అనుమానించిన కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

telugu tv actress jhansi suicide case Police investigation