Search
Friday 16 November 2018
  • :
  • :

ఆల్వి పాలక్ తయారీ విధానం

 Telugu Vantalu Recipes

అచారీ హరిమోతి

కావలసిన పదార్థాలు

పచ్చి బఠాణీలు 100 గ్రా., బంగాళాదుంపలు పావు కిలో, పెరుగు 150 మి.లీ, గరంమసాలా టీ స్పూను, ఎండుమిర్చి ముద్ద 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు రెండు, పసుపు అర టీ స్పూను, నూనె వేయించడానికి సరిపడా, మైదా 100 గ్రా,
జీలకర్ర టీ స్పూను, ఉప్పు తగినంత
తయారీ విధానం
* బంగాళాదుంపల్ని ఉడికించి దించాలి. ఆరాక పొట్టు తీసి మెత్తగా మెదపాలి. అందులో మైదాపిండి వేసి కలపాలి.
* ఇప్పుడు ఒక్కోస్పూను బంగాళాదుంప మిశ్రమం తీసుకుని అందులో తాజా బఠాణీలు స్టఫ్ చేసి, కోఫ్తాలు చేయాలి.
* ఓ గిన్నెలో పెరుగు వేసి బాగా గిలకొట్టాలి. అందులోనే ఎండుమిర్చి ముద్ద, పసుపు, గరంమసాలా, ఉప్పు వేసి కలపాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక కోఫ్తాలు వేయించి తీయాలి. చివరగా నూనె వంపేసి రెండు టీ స్పూన్లు ఉంచి అందులో జీలకర్ర, ఉల్లిముక్కలు వేసి వేయించాలి.
* ఇప్పుడు పెరుగు మిశ్రమాన్ని వేసి బాగా మరిగించాలి. తరువాత వేయించిన కోఫ్తాలు వేసి సిమ్‌లో చిక్కగా అయ్యేవరకు ఉడికించి దించాలి.

పంజాబీ బైంగన్ 

కావలసిన పదార్థాలు
గుండ్రటి చిన్న వంకాయలు 10-12 , జీలకర్ర అర టీ స్పూను,
ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు,
కొత్తిమీర తరుగు పావు కప్పు,
నూనె 3 టేబుల్ స్పూన్లు,
మసాలాకోసం…
మెంతులు అర టీ స్పూను,
యాలకులు, బిర్యానీ ఆకులు 2 చొప్పున, దాల్చిన చెక్క 1 పెద్దది,
ధనియాలు పావు కప్పు,
జీలకర్ర, అల్లం ముక్కలు టీ స్పూను చొప్పున, ఉల్లిపాయ ముక్కలు ముప్పావు కప్పు,
పసుపు అర టీ స్పూను,
ఎండుమిర్చి (నానబెట్టాలి) ఐదారు,
ఆమ్‌చూర్ పొడి అర టీ స్పూను,
టమోటా ముక్కలు అరకప్పు,
నూనె పావు కప్పు,ఉప్పు తగినంత
తయారీ విధానం
* ముందు మసాలా తయారు చేసుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ, టమోటా ముక్కలు, ఎండుమిర్చి తప్ప మసాలాకోసం పెట్టుకున్న మిగిలిన పదార్థాలన్నీ వేసి వేయించుకుని మిక్సీలో తీసు కోవాలి.
* అందులో ఎండుమిర్చి, తగినంత ఉప్పు, ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి.
* ఇప్పుడు వంకాయలు విడిపోకుండా నాలుగు భాగాలు వచ్చేలా కోసి ఈ మిశ్రమాన్ని వాటిల్లో కూరాలి.
* బాణలిలో మిగిలిన నూనె వేడిచేసి జీలకర్ర వేయించాలి.
* అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేయించి వంకాయల్ని ఒక్కొక్కటిగా ఉంచాలి. పైన మిగిలిన మసాలా కూడా వేసి, పావు కప్పు నీళ్లు పోసి మంట తగ్గించాలి. వంకాయ విడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కాసేపటికి కూర తయారవుతుంది. అప్పుడు దింపేసి కొత్తిమీర తరుగు వేస్తే చాలు. నోరూరించే పంజాబీ బైంగన్ తయార్.

ఆల్వి  పాలక్

కావలసిన పదార్థాలు
ఆలు కేజీ, ఆవనూనె 3 టేబుల్ స్పూన్లు, పాలకూర 10 కట్టలు,
అల్లం వెల్లుల్లి ముద్ద
టేబుల్ స్పూను,
ఎండుమిర్చి 10, పసుపు టేబుల్ స్పూను,
సోంపుపొడి టేబుల్ స్పూను,
యాలకులు ఆరు,
దాల్చినచెక్క ఒకటి(పెద్దది),
టొమాటో గుజ్జు ఒకటిన్నర కప్పు,
ఉప్పు తగినంత.
తయారీ విధానం…
* ఎండుమిర్చిలో కొద్దిగా నీళ్లు పోసి ఉడికించి తర్వాత మెత్తని పేస్టులా చేసుకోవాలి.
* ఆలు చెక్కుతీసి నీళ్లలో వేసి ఉడికించుకుని పెట్టుకోవాలి.

* ఇప్పుడు మరో బాణలిలో ఆవనూనె రెండు నిమిషాలు వేడిచేసి అల్లం వెల్లుల్లి ముద్ద వేయించుకోవాలి.
* తర్వాత ముందుగా చేసుకున్న ఎండుమిర్చి పేస్టు, టొమాటో గుజ్జు, అందులో కాసిన్ని నీళ్లు, పసుపు, సోంపు, యాలకులు, దాల్చినచెక్క, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
* అందులో ముందుగా మగ్గించి పెట్టుకున్న ఆలుముక్కలు, పాలకూర తరుగు కూడా వేసి కలిపి మూత పెట్టేయాలి.
* కాసేపటికి పాలకూర ఉడుకుతుంది. అంతే… ఆల్వీ పాలక్ సిద్ధం.

కంట్రీ చెఫ్ సుస్మిత చౌదరి
సుస్మిత స్కూల్ ఆఫ్ కుకరి
93931 69595

Comments

comments