Search
Wednesday 14 November 2018
  • :
  • :

ఎత్తైన ఆలయాలు

Temples-on-Hills

ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు, చర్చిలు, మఠాలు ఉన్నాయి.  కానీ ఇక్కడ ఉన్న ఈ ఎత్తైన ఆశ్రమాలు, చర్చిలు ఎత్తైన ప్రదేశాలలో నిర్మించబడి ఎంతో ఆకర్షణీయంగా యాత్రికులను ఆకట్టుకుంటున్నాయి. 

 శిములా ఆశ్రమంః నల్ల సముద్రం సమీపంలో ఉత్తర టర్కీలో ఉన్న సుమేలా ఆశ్రమం సముద్ర మట్టానికి 4000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండపై ఉంది.

 సెయింట్ మిచెల్ డి’ఐగ్యూలీ : ఈ చర్చి ఒక అగ్నిపర్వతం చివరన 279 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఫాన్స్‌లోని లే పుయ్-ఎ-వేలే పట్టణంలో లోయిర్ నదికి సమీపంలో ఉంది.

తాంగ్ కలాత్ మొనాస్ట్రీ: మౌంట్ పోపా మయన్మార్  అంతరించిపోయిన అగ్నిపర్వతం. రాయి నిర్మాణంతో ఏటవాలుగా నిర్మించబడింది.  గుడికి వెళ్లాలంటే యాత్రికులు 777 మెట్లు ఎక్కాల్సిందే.

 మెటెయోరాలో: ఇది గ్రీస్‌లో ఉంది. మెటియోరా  అంటే ‘ఆకాశంలో మధ్యలో‘ లేదా ‘గంభీరమైనది‘ అని అర్థ్ధం. ఇక్కడ  ఆశ్రమాల  స్తంభాలు సహజ  సుందరంగా ఉంటాయి. ఇక్కడ  300 సంవత్సరాల నుండి సన్యాసులు, సన్యాసినులు  ఆశ్రమాలు నిర్మించుకుని ఉంటున్నారు.

పరో తత్త్సాంగ్ (టైగర్ నెస్ట్):  భూటాన్‌లోని బౌద్ధ దేవాలయ సమూహం. పారో లోయలో ఒక రాక్ మీద ఉంది. పద్మసంభవ భారతీయ ఉపాధ్యాయుడు 8వ శతాబ్దంలో ఇక్కడ బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశాడు.  ఆయన గౌరవార్థం ఇక్కడ ఏటా ఇక్కడ పండుగ జరుపుకుంటారు.

 పురా లుహూర్ ఉల్వాటు: ఉల్వాటు అంటే ‘భూమి చివరలో రాక్’ అని అర్థం. ఈ దేవాలయం 11 వ శతాబ్దం నాటిది. పొరుగు ద్వీపం జావా నుండి ఒక గురువు సముద్రమట్టానికి 200 అడుగుల ఎత్తున నిర్మించాడు.

ఫ్యూగల్ మొనాస్టరీ: లడఖ్  స్వయంప్రతిపత్తమైన హిమాలయ ప్రాంతంలో ఉంది. సందర్శకులు పాదయాత్రతో ఇక్కడకు వస్తారు. బౌద్ధుల ఉపాధ్యాయులు ఒకసారి ధ్యానం చేసిన గుహ చుట్టూ ఇది నిర్మించబడింది. దాదాపు 70 మంది  సన్యాసులు నివాసం ఉంటారు.

Comments

comments