Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు ముస్తాబు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు ముస్తాబు

TEMPLE

మన తెలంగాణ/ఘట్‌కేసర్: వైకుంఠ ఏకాదశిని పురష్కరించుకొని భూనీళా సమేత శ్రీ రంగనా ధస్వామి ఆలయంలో బ్రాహ్మణులు, గ్రామ ప్రజలు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఘట్‌కేసర్ మండల పరిధిలోని యంనంపేట్ గ్రామంలో ఉన్న భూనీల సమేత రంగనాధ స్వామి ఆల యానికి గత నెల రోజులుగా రంగులతో ముస్తాబు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మల్కజ్‌గిరికి, హైదరాబాద్ పలు ప్రాంతాలకు చెందిన బ్రామ్మణులు కుటుంబ సమేతంగా స్వామివారికి శనివారం సేవలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం ప్రాంగణంలో 300 తులసి మొక్కలు నాటారు. ఆదివారం వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తులకు గ్రామ పంచాయతీ, అయ్యప్ప సేవాసమితి, గ్రామ నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో బ్రామ్మణ కుంటుంబ సభ్యులు, సర్పంచ్ పోలగోని అరుణ శివకుమార్‌గౌడ్, ఎంపిటీసీ సభ్యులు నర్రి శ్రీశైలం, ఉపసర్పంచ్ భాషగోని సుధర్శన్ యాదవ్, వార్డు సభ్యులు సగ్గు శ్రీనివాస్, బొక్క బుచ్చిరెడ్డి, సామల యాదయ్య, జి.లలిత, పి.లలిత, ఎం.సుశీల, మాజీ సర్పంచ్‌లు పి.రాములు, నర్రి సందయ్య, నాయకులు పి.శివకుమార్‌గౌడ్, పోశేట్టి, రాందాస్, గ్రామ యువత, తదితరులు పాల్గొన్నారు.