Home జాతీయ వార్తలు రోడ్డు ప్రమాదంలో పది మంది అయ్యప్ప భక్తులు మృతి

రోడ్డు ప్రమాదంలో పది మంది అయ్యప్ప భక్తులు మృతి

 

చెన్నై: తమిళనాడులో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుదుక్కొట్టె దగ్గర కంటైనర్-వ్యాన్ ఢీకొని పది మంది అయ్యప్ప భక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు మెదక్ జిల్లా హాజీపూర్ గ్రామానికి చెందిన నాగరాజు (35), మహేశ్ (28), కుమార్ (22), శ్యామ్, ప్రవీణ్, కృష్ణ, సాయి, ఆంజనేయులు, సురేష్, వ్యాన్‌డ్రైవర్‌గా గుర్తించారు. రామేశ్వరం నుంచి  శబరిమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం పుదుక్కొట్టే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

ఈ ప్రమాదంపై తెలంగాణ సిఎం కెసిఆర్, సిద్దిపేట ఎంఎల్ఎ హరీష్ రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వారు తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. మృతదేహాలను మెదక్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని వారు పుదుక్కొట్టె కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

Ten Ayyappa Devotees Dead in Road Accident in Tamilnadu