Home తాజా వార్తలు కూలిన భవనం: 9 మృతదేహాలు వెలికితీత

కూలిన భవనం: 9 మృతదేహాలు వెలికితీత

Building-Collapsed

లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో భవనం శిథిలాల నుంచి మరో మృతదేహం లభ్యమైంది. గ్రేటర్ నోయిడాలోని షా బేరి గ్రామంలో బుధవారం ఆరంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో ఇప్పటి వరకు తొమ్మిది మృతదేహాలు వెలికితీసిన విషయం తెలిసిందే. ఎన్ డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వాధికారులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.