Home రాజన్న సిరిసిల్ల ఏడాదిలో 10మంది మృతి

ఏడాదిలో 10మంది మృతి

 50 మందికి పైగా గాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రాణాలు తీస్తున్న ఇసుక లారీలు
‘మామూలు’గానే అధికారులు

                 Road-Accident

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా లో జిల్లెల చంద్రాపూర్ నేరెళ్ల గ్రామాలను కలిపే క్రాస్ రోడ్డుపై తిరుగుతున్న వందలాది లారీలు మూడు గ్రామాల ప్రజల మరణశాసనాన్ని లిఖి స్తున్నాయి. మానేరు, మూలవాగు నుంచి వంద లాది లారీల్లో ఇసుక జిల్లెల క్రాస్ రోడ్డు మీదగా తరలిస్తుంటారు. సాయంత్రం ఆరు గంటల నుం చి మరుసటి రోజు ఉదయం వరకు ఈ క్రాస్ రో డ్డు దాటే లారీల మూలంగా జరిగే ప్రమాదల కా రణంగా పదుల సంఖ్యలో మృత్యువాత పడుతు న్నారు. క్షతగాత్రులవుతున్న వారి సంఖ్య 50 మించిపోయింది. దీనిపై ఆ గ్రామాల ప్రజలు రా స్తారోకో, నిరాహార దీక్షలు చేపట్టి ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది.

మూడు గ్రామాల ప్రజలు ఇటీవల ఇసుక లారీ లను నియంత్రించాలని, ఇసుక లారీల రవాణా ను అరికట్టాలని కోరుతూ రాస్తారోకో చేపట్టారు. అయితే అధికారులు చర్యలు తీసుకోకపోవడం తో ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుంది. కొంతకాలం పోలీసులు సిసి కెమెరాలతో కూడిన చెక్‌పోస్టును ఏర్పాటు చేసి పోలీసుల బృందంతో నిఘా ఏర్పాటు చేశారు. మామూళ్లకు అలావా టు పడి పోలీసులు చెక్‌పోస్టును ఇటీవల ఎత్తివే శారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యం లో ఇసుక అక్రమ రవాణాకు కల్లెం వేయడానికి ప్రభుత్వమే ఇసుక తరలింపునకు అనుమతి మం జూరు చేసింది. జిల్లాలో ఇప్పటికే 9 ఇసుక క్వా రీలు కొనసాగుతుండగా, నూతంగా మరో క్వారీ ని గుర్తించారు.

ఇలా గుర్తించిన క్వారీలపై ప్రభు త్వానికి రూ. 90కోట్ల ఆదాయం సమకూరడం తో ఇసుక అక్రమ రవాణా జరగడంలేదని ప్రభు త్వం భావించింది. గతంలో ఇసుకను అక్రమం గా అధికారుల అండతో తరలించుకుపోగా ఇ ప్పుడు రాజా మార్గంలో ఒక లారీ పర్మిట్‌పై రెం డు, మూడు లారీల ఇసుకను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో లారీల పర్మినెంట్ డ్రైవర్లు వారికి కావలసినన్నీ ట్రిప్పులు వేయలేక పోవడంతో రూ.3 నుంచి 4 వేల వేతనాలు ఇచ్చి తాత్కాలిక డ్రైవర్లను నియమించుకుంటున్నారు.

వీరు చేతి నిండా డబ్బులు ఉండడంతో మద్యం తాగి లారీని నడుపుతూ తరుచూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇసుక రవాణాపైన అధికా రులు కఠినంగా వ్యవహరిస్తే ప్రమాదాలు జరగవ ని తెలిసినా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ఇసుక నిరంతర తరలింపు వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి ఈ ప్రాం తం ఎడారిగా మారే అవకాశం ఉందని పర్యా వరాణవేత్తలు పలుమార్లు సూచించిన వారి మా టలను కూడా బేఖాతరు చేశారు. ప్రభుత్వం డ బ్బు సంపాదనే ధ్యేయంగా ఇసుకను తరలించేం దుకు పర్మిట్లు ఇస్తుండగా స్థానికులు మాత్రం ప్ర మాదాల భారిన పడుతున్నారు. మరోవైపు లారీ ల ద్వారా ఇసుక తరలింపును ఆపాలని ఆందోళ నలు చేపడుతున్నారు. అయినా ఇసుక తరలింపు మాత్రం నిరంతరం జరుగుతూనే ఉంది. అప్పుడ ప్పుడు అధికారులు వివిధ పేర్లతో లారీలను పట్టు కొని నామామాత్రపు కేసులు బనాయిస్తున్నారు.