Search
Monday 23 July 2018
  • :
  • :

ఉరితోనే ఆ పది మంది మృతి

11-Members-died-in-Delhi

న్యూఢిల్లీ : ఉత్తర ఢిల్లీలో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ఆత్మహత్య చేసుకున్న వారి పోస్ట్‌మార్టం రిపోర్ట్, వారు ఉరివేసుకోవడం వల్లే చనిపోయారని నిర్ధారించింది. ఢిల్లీలోని బురారి ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబం ఉరి వేసుకుని చనిపోయిందని, ఈ మరణాల వెనక ఎటువంటి కుట్ర లేదని సీనియర్ పోలీసు అధికారి ప్రకటించారు. అయితే 77 ఏళ్ల నారాయణ దేవి పోస్ట్‌మార్టం రిపోర్టు పూర్తిగా రాలేదని, ప్రాథమిక రిపోర్టులో ఆమె కూడా ఉరి వేసుకుని చనిపోయిందని తేలిందని ఆయన చెప్పారు.

ఆత్మహత్య చేసుకున్న వారి శరీరాలపై ఎటువంటి గాయాలు లేవని, కొంత వరకు గీరుకుపోయిన గుర్తులు కనిపించాయని తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది జూలై 1 న ఇంటి పైకప్పుకు ఉరి వేసుకుని చనిపోయారు. అయితే నారాయణ దేవి శవం మరో గదిలో నేల మీద కనపడింది.

Comments

comments