Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఆర్టిసి బస్సును ఢీకొట్టిన లారీ: 10 మందికి గాయాలు

One Dead in Road Accident near Shamshabad Airport Today

జనగామ: ఆర్టిసి బస్సును ఇసుక లారీ ఢీకొట్టిన ఘటన జనగామ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ముందు వెళ్తున్న ఆర్టిసి బస్సును ఓవర్ టేక్ చేయబోయిన ఇసుక లారీ.. ఎదురుగా వస్తున్న మరో ఆర్టిసి బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇసుక లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

comments