Search
Saturday 17 November 2018
  • :
  • :

భూపాలపల్లికి 10 పల్లె వెలుగు బస్సులు

Ten new Palle velugu Busses  provided to jayashankar dist

మన తెలంగాణ/భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్రంలో 100 కోట్లతో సిఎం కెసిఆర్ కొత్తబస్సులు కొనుగోలు చేయడం జరిగిందని ఆర్‌టిసిని ప్రగతి పథంలో ముందుంచి  ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్షం అని  రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కోటి రూపాయలతో నిర్మించిన, అలాగే 50లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన నూతన ప్రయాణ ప్రాంగణాన్ని శాసన సభాపతి సిరికొండ మధుసూధనాచారితో కలిసి ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ. .భూపాలపల్లికి అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టీ ఇంకా ప్రజల సౌకార్యం కోసం 10 పల్లెవెలుగుల బస్సులను అదనంగా  కేటాయించడం జరుగుతుందన్నారు. గతంలో నష్టాల్లో ఉన్నా ఆర్‌టిసిని లాభాల దిశగా వివిధ ప్రయత్నాలను చేసి నష్టాలను తగ్గించడం జరుగుతుందన్నారు. ప్రజాప్రతినిధులు నెలకు ఒక్కసారైన ఆర్టీసి బస్సులో ప్రయానం చేసి సంస్థను కాపాడి ప్రజలకు సంస్థపై నమ్మకాన్నికల్పించాలన్నారు.పేదవారు ప్రయానించే ఆర్టీసీని ప్రతి ఒక్కరు కాపాడుకొవాలన్నారు.ప్రభుత్వం పేద ప్రజలకొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.కష్టపడి పని చేసేనాయకుడు సిరికొండ మధుసూదనాచారి అని అన్నారు. అనంతరం స్పీకర్ మా ట్లాడుతూ.. పాలకుల నిర్లక్షం వల్ల ఆర్‌టీసీ వెనక బడిపోయిందన్నారు.తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ ఆర్‌టీసీ అభివృధ్దికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. పేదప్రజకు తమ గమ్యాలను చేర్చే ఆర్టీసిని బ్రతికించవలసిన అవసరం అందరిపైన ఎందన్నారు. ప్రతి ఒక్కరు ఉన్న ఊరును కన్నతల్లిని అలాగే ఆర్టీసీ బస్సును కూడ మరవద్దని స్పీకర్ గుర్తు చేశారు.్ధ ష్టానికి తగ్గించామని వారు తెలిపారు.రోజు 10,200ల బస్.ఈకార్యక్రమంలో ఆర్టీసీ చైర్మెన్ సోమారపు సత్యనారాయణ,ఎం పసునూరి దయాకర్,సాంబారి సమ్మారావు,ఆర్టీసీ ఎండీ రమణారావు,నవనీతరావు,మున్సిపల్ చైర్‌పర్సన్ మండారి సంపూర్ణరవి,వైస్ చైర్మన్ గణపతి, వాసు దేవరెడ్డి,భారతిరెనాయకులు క్యాతరాజు సాంబమూర్తి,పైడిపల్లి రమేష్,అన్నిమండల పార్టీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments